WorldWonders

కలకత్తాలో డబ్బుల వర్షం

It's raining money in Calcutta

కోల్‌క‌తాలోని ఓ బిల్డింగ్ నుంచి నోట్ల క‌ట్ట‌ల వ‌ర్షం కురిసింది.

న‌గ‌రంలోని బెంటిక్ స్ట్రీట్‌లో ఉన్న హోక్యూ మర్క‌న్‌టైల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆఫీసు వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

బిల్డింగ్‌లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఆర‌వ అంత‌స్తు నుంచి కొంద‌రు నోట్ల క‌ట్ట‌లను బ‌య‌ట‌కు విసిరేశారు.

బిల్డింగ్ నుంచి నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డుతున్న దృశ్యాలు వీడియోకు చిక్కాయి.

అయితే ఆ బిల్డింగ్‌లోని ఆర‌వ అంత‌స్తులోనే డైర‌క్ట‌రేట్ ఆఫ్ రెవ‌న్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేప‌ట్టారు.

2వేలు, 500, వంద నోట్ల క‌ట్ట‌ల‌ను బిల్డింగ్ నుంచి విసిరేసిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు.

బిల్డింగ్‌లో ఓ ప్రైవేటు కంపెనీ ఆఫీసులో సోదాలు చేసేందుకు డీఆర్ఐ అధికారులు అక్క‌డ‌కు వెళ్లారు.

ఆ స‌మ‌యంలో చీపుర‌క‌ర్ర‌ల‌తో కిటికీలోంచి నోట్ల క‌ట్ట‌ల‌ను విసిరేసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు కేసును న‌మోదు చేశారు.

కింద‌ప‌డ్డ నోట్ల క‌ట్ట‌ల‌ను కొంద‌రు సేక‌రిస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి.