Movies

రెండోసారి శిల్పా హంగామా

Shilpa Shetty Hungama2 Begins Shooting

అయోమయంలో కొందర్ని అపార్థం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అప్పుడామె కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. తన తెలివితేటలతో ఆ సమస్యలను ఎలా పరిష్కరించారు అనే కథాంశంతో ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘హంగామా’కు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి కూడా ప్రియదర్శనే దర్శకుడు కావడం విశేషం. ‘హంగామా 2’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో శిల్పాశెట్టి ప్రధాన పాత్రధారి.పరేష్ రావల్, మీజాన్ జఫేరి, ప్రణీత కీలక పాత్రల్లో నటిస్తారట. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు డెహ్రాడూన్లో జరుగుతున్నాయని తెలిసింది. 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా ‘నికమ్మా’ సినిమాతో కమ్బ్యాక్ ఇçస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ మీద ఉన్నప్పుడే ‘హంగామా 2’ చిత్రానికి సైన్ చేశారు. 2007లో ‘అప్నే’లో కథానాయికగా నటించిన తర్వాత ‘ఓం శాంతి’, ‘దోస్తానా’, ‘డిష్కియూన్’ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు శిల్పా. మళ్లీ కథానాయికగా కనిపించబోతున్నది ‘నికమ్మా’, ‘హంగామా 2’లోనే.