WorldWonders

బస్సులోనే తాళి కడదామని ప్రయత్నించిన జగన్

Guy attempts wedding by tying the knot in moving bus in India

బస్సులో వెళ్తున్న ఓ యువతికి బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన తమిళనాడు వెల్లూరులో జరిగింది.

అంబూరు సమీపంలోని సాండ్రోర్ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్​ స్థానికంగా ఉంటున్న ఓ యువతిని కళాశాల రోజుల నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెకు ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు.

ఇటీవలే ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి కుదిరింది. విషయం తెలుసుకున్న జగన్​.. యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిపాడు.

ఆమె నిరాకరించడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయాడు.

మంగళవారం ఉదయం ఆ యువతి అంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో వెళుతుండడం చూసి తను కూడా వాహనం ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న తాళిని ఆమెకు బలవంతంగా కట్టే ప్రయత్నం చేశాడు.

బాధితురాలు గట్టిగా కేకలు వేయడం వల్ల తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. జగన్​ను పట్టుకొని దేహశుద్ధి చేశారు.

అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితునిపై కేసు నమోదుచేశారు.