అమెరికాతో సినీనటులు గొల్లపూడి మారుతీరావుకు మంచి అనుబంధం ఉంది. ఆయనకు ఈ దేశంలో చాలా మంది సాహితీ మిత్రులు ఉన్నారు. “రేడియో, సాహిత్య, నాటక, సినిమా రంగాలలో రచయితగా, నటుడిగా అనేక పురస్కారాలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి డా. గొల్లపూడి మారుతీ రావు గారితో ఎన్నో ఏళ్ల అనుబంధం, స్నేహం, మరువలేనిది. డాలస్ నగరంలో స్థానిక తెలుగు సంస్థ చేపట్టిన నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన సాహితీవేత్తను కోల్పోవడం బాధాకరం. తరుచూ ఫోన్ సంభాషణ ద్వారా ఎంతో ఆప్యాయంగా పలు విషయాల పై తరుచూ చర్చించేవాళ్ళం. సామాజిక స్పృహకలిగిన ఒక మంచిరచయితను మేధావిని మిత్రుని కోల్పోవడం దురదృష్టకరం. 2013 లో డాలస్ లో జరిగిన తానా 19వ మహాసభల్లో ఆయనను సత్కరించుకొనే అవకాశం కలిగింది. 2017 డిసెంబర్ 16 న అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున ఏలూరులో జరిగిన సభలో ఆయనకు సినీరత్న పురస్కారం అందజేసి గౌరవించుకున్నాం. డా. గొల్లపూడి మరణం తెలుగు వారందరికి ఒక తీరని లోటు. డా. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము.” అని తానా మాజీ అధ్యక్షులు డా.తోటకూర ప్రసాద్ ఓ ప్రకటనలో తన సంతాపాన్ని తెలిపారు.
అమెరికాతో గొల్లపూడి అనుబంధం

Related tags :