Sports

19న కలకత్తాలో IPL వేలం

IPL 2020 Auction In Kolkata On The 19th of December-19న కలకత్తాలో IPL వేలం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 సీజన్‌ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఏర్పాట్లన్నీ పూర్తైనట్టు సమాచారం. ఈ నెల 19 కోల్‌కతాలో వేలం జరగనుంది. మొత్తం 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది వేలానికి ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. ఎప్పటిలాగే స్టార్‌ ఆటగాళ్లు కొందరు లీగ్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా మిచెల్‌ స్టార్క్‌, జో రూట్‌ ఆ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ స్టార్క్‌ విరామం తీసుకోవడం గమనార్హం. ఇంగ్లాండ్‌ టెస్టు సారథి జో రూట్‌ పొట్టి క్రికెట్‌ ఫార్మాట్లో అంతగా మెరుపులు మెరిపించలేదు. వేలానికి ఎంపికైన వారిలో 24 మంది కొత్తవారే ఉన్నారని తెలిసింది. అందులో 19 మంది టీమిండియాకు ఆడారు. ముష్ఫికర్‌ రహీమ్‌, ఆడమ్‌ జంపా పేర్లను ఫ్రాంచైజీలే షార్ట్‌లిస్ట్‌ చేయగా రహీమ్‌ వేలం నుంచి తప్పుకున్నాడు. ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఇయాన్‌ మోర్గాన్‌ (ఇంగ్లాండ్‌), కమిన్స్‌ (ఆసీస్‌) వేలంలో భారీ ధర పలుకుతారని తెలుస్తోంది. రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌లిన్‌, ఆరోన్‌ఫించ్‌, జేసన్‌ రాయ్‌కు సైతం మంచి డిమాండ్‌ ఉంది. డిసెంబర్‌ 19న ఉదయం 10 గంటలకు వేలం ఆరంభమవుతుంది. 73 ఖాళీలకు వేలం జరుగుతుంది.