Kids

మన అమ్మాయి జర భద్రం!

Keep A Good Eye On Your Girls-Teach Them Defense Techniques

మీ ఇంట్లో ఆడపిల్లలున్నారా?

అయితే మనం అందరూ ఎలా జాగ్రతగా ఉండాలి తెలుసుకోండి

1) మన కుటుంబ సభ్యులు కానివారి నుంచి పిల్లలని దూరంగా పెట్టండి.

2) పిల్లలని ఒంటరిగా ఆడుకోమనడం,పక్క ఇళ్ళకు పంపడం అంత మంచిది కాదు.

3) మనతో ఎంతో చనువుగా ఉన్న బయట వాళ్ళు కూడా పిల్లలకి ప్రమాదకారులే కావచ్చు..

4) ఇతరులు మన పిల్లలని ఎత్తుకుని ముద్దులిడుతున్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

5)చాక్లెట్ కొనిపెడతా షాపుకు తీసుకెళతా అంటూ మీ దగ్గర నుండి పిల్లలని తీసుకున్న వ్యక్తుల కోరికను సున్నితంగా తిరస్కరించండి….

పరిచయం ఉన్న వ్వక్తులకు పిల్లలని అప్పగించి బయటకు తీసుకెళ్ళమని మీరే పురమాయించకండి.

6)అత్యవసర పరిస్థితుల్లో పిల్లలని వేరే ఇంట్లో వదలిగానీ..లేదా మీ ఇంట్లోనే వదలి వెళ్ళలసి వస్తే ఆ ప్రయత్నం మానుకొండి.

7) పిల్లలు ఆడుకొనే చోటగాని,స్కూలుకు వెళ్ళే దారిలోగాని, స్కూల్లో జరిగే విషయాల్లో గాని ఆరా తీస్తూ ఉండండి.

8)కొంచెం ఎదిగిన పిల్లలకి దేహంలో ఎక్కడ ముట్టుకుంటే తప్పో.. అసభ్య ప్రవర్తన ఏవిధంగా గుర్తించాలో వివరించండి.

8)అలాంటి వ్వక్తులు నుంచి ఎలా తప్పించుకొవాలో, ధైర్యంగా ఎలా నిలబడలో,స్వయం రక్షణ ఎలా చేసుకోవాలి వివరించాలి.

9)ఇంటి టెలిఫోన్ నెంబర్, పోలీస్ స్టేషన్ నెంబర్.. పిల్లల వద్ద ఉంచి..అత్యవసర సమయాల్లో ఇతరుల సహాయంతో ఫోన్ చేసేలా పిల్లలకు నేర్పండి.

10)ఇంటికి దూరపు చుట్టాలు వచ్చినప్పుడు మీ పిల్లలని మీ బెడ్ రూంలోనే పడుకోబెట్టుకోవడం ఉత్తమమైన పని.

11)పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా అని గంటలు గంటలు పనిలో తలమునకలై, పట్టించుకోకుండా ఉండడం అంత మంచిది కాదు.

12)పిల్లలు ఏదైనా చెప్పడానికి సంకోచిస్తున్న, లేదా మూడీగా ఉన్నా, భయం భయంగా చూస్తున్న, వాళ్ళల్లో వాళ్ళే మధనపడుతున్నా.. ఏదో జరిగింది అని గ్రహించి ప్రేమగా ఆరా తియ్యండి.

13)లైంగిక విషయాలలో ఎవరిమీద అయినా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు.

14)12 ఏళ్ల బాలురు నుంచి వృద్దులు వరకూ పిల్లలకు లైంగిక శత్రువులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి.

15)మీ పిల్లలతో ప్రేమగా ఉండండి.

మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని టెక్నిక్స్ వున్నాయి. వాటిని నేర్పించoడి.

స్కూల్ లో, ట్యూషన్ లో ఇతరుల బిహేవియర్ ఎలా ఉందొ రోజు కనుక్కోండి.

ప్రతీ మనిషి దగ్గిర ఒక పది అడుగుల డిస్టన్స్ మైంటైన్ చేయమని instructions ఇవ్వండి.

ఏదైనా డేంజర్ ఉంది అని అనిపిస్తే…. first గట్టిగా అరిచి గోల చేయమని చెప్పండి. Next అందుబాటులో వున్న రాయి కర్ర ఇసుక use చేసి తప్పించుకోవడం లో training ఇవ్వండి. పారిపోవడానికి దారులు చూసుకోవడం నేర్పించండి.

అన్నిటికి మించి ఏ విషయం అయినా ఇంట్లో చెప్తే తిడతారు అన్న భయాన్ని పోగొట్టండి. Free గా వాళ్ళ feelings ని భయాలను express చేసే చనువు ఇవ్వండి.

అన్న తమ్ముళ్లు ఉంటే….. సోదరికి supportive గా ఉండటం నేర్పించండి.

మన ఇంటి మహాలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మనదే.