ScienceAndTech

ధ్యానానికి యాప్‌లు ఉన్నాయి

Apps That Help In Meditation-Telugu Apps & SciTech News

ఆధునిక జీవితంలో ఒత్తిళ్లు ఎక్కువయ్యే కొద్దీ – ధ్యానం విలువ ఏంటన్నది జనానికి తెలిసి వస్తోంది. ఈరోజుల్లో ఉద్యోగంలోనే కాదు, చదువుల్లో, కుటుంబంలో కూడా బాధ్యతలూ ఒత్తిళ్లూ పెరుగుతున్నాయి. మనసులో ఆలోచనలు తగ్గించుకుని – ప్రశాంతంగా ఉండగలిగితే తప్ప – ఈ బాధ్యతలన్నీ సవ్యంగా నెరవేర్చలేం. అసలు మానసిక ప్రశాంతత అన్నది లేకపోతే – జీవితంలో అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం మాట అటుంచి, నిత్యజీవితంలో ఎదురయ్యే మామూలు సమస్యల్ని ఎదుర్కోవడం కూడా కష్టమే! అందుకే ఆధునికకాలంలో – అంతరంగానికి ప్రశాంతతనిచ్చే ధ్యానానికి ప్రాముఖ్యం ఏర్పడింది.

మరి నిత్యం స్మార్ట్‌ఫోన్‌తో గడిపే ఈనాటి జనానికి ధ్యానంలో మెలకువలు తెలుసుకునే టైమ్‌ ఎక్కడుంటుంది? అందుకోసమే మెడిటేషన్‌ చేసేవారికి, నేర్చుకునేవారికి ఉపయోగపడే యాప్స్‌ కొన్నిరూపొందాయి. వాటిలో ముఖ్యమైన 12 యాప్స్‌ ఇవే! ఇన్‌స్టాల్‌ చేయండి. ధ్యానం నేర్చుకోండి. మెలకువలు నేర్చుకోండి. క్రమబద్ధంగా చేయండి. ప్రశాంతత పొందండి!

ఆరా – Aura
బుద్ధిఫై – Buddhify
కామ్‌ -Calm
హెడ్‌స్పేస్‌ -Headspace
ఇన్‌సైట్‌ టైమర్‌ -Insight Timer
మెడిటేషన్‌ స్టూడియో -Meditation Studio
ఓక్‌ -Oak
సింపుల్‌ హ్యాబిట్‌ -Simple Habit
స్మైలింగ్‌మైండ్‌ -SmilingMind
స్టాప్‌ బ్రీద్‌ అండ్‌ థింక్ -Stop, Breathe & Think
టెన్‌పర్సెంట్‌ హ్యాపియర్‌ -Ten Percent Happier
ది మైండ్‌ఫుల్‌నెస్‌ యాప్‌ -The Mindfulness App