Food

మెదడు చురుకుదనానికి డీ విటమిన్ తప్పనిసరి

Vitamin D Enables Brain Sparks And Active Moods

ప్రధానంగా సూర్యరశ్మితో లభించే ‘విటమిన్-డి’ లోపం శరీరంలో పటుత్వ రాహిత్యానికి దారితీస్తుంది. ఎముకలు గట్టిగా, దృఢంగా ఉంటేనే దేహం పటుత్వాన్ని కలిగి ఉంటుంది.‘విటమిన్-డి’ చర్మంలోని పూర్వగామి అయిన ఒక కొవ్వు (7 డీహైడ్రోకొలెస్ట్రాల్) పదార్థంతో రూపొందుతుంది. అందుకే, మన శరీరాన్ని మరీ సున్నితంగా, ‘ఎండకు ఉంటే కంది పోతారన్నంత’ సుఖంగా చూడకూడదని శాస్త్రవేత్తలు అంటారు. సూర్యకిరణాలు శరీరాన్ని తాకినప్పుడు చర్మం గ్రహించిన వేడిమి ‘7డీహైడ్రోకొలెస్ట్రాల్’ (ప్రోవిటమిన్: తయారీకి కావలసిన పదార్థం) ను పూర్తిస్థాయి ‘విటమిన్-డి’గా మారుస్తుంది. ‘విటమిన్-డి’ కొన్ని ఆహార పదార్థాలలోనూ చాలా స్వల్పమొత్తంలో లభిస్తుంది. వాటిలో కాలేయం, చేప, గుడ్డు పచ్చసొన, పాలు, పెరుగు, నెయ్యి ఉన్నాయి. ‘చేప కాలేయ చమురు’లో అయితే ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలతోపాటు నోటిపండ్లు ఆరోగ్యంగా, గట్టి పడడానికి ‘విటమిన్-డి’ తప్పనిసరి. ఎంతసేపు నీడ పట్టున, ఏసీలలోనే గడిపే పెద్దలతోపాటు పిల్లలలోనూ ‘విటమిన్-డి’ లోపం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నది. దీనివల్ల పిల్లల్లో ‘బాలాస్థి రోగం’ ఏర్పడే ప్రమాదం ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు. ఈ విటమిన్ శరీరానికి సరిగా అందని కారణంగా ఎముకలు, నోటిపండ్లకు క్యాల్షియమ్, ఫాస్పరస్ల కొరత ఏర్పడుతుంది. దీంతో వాటిలో పటుత్వం లోపిస్తుంది. ఫలితంగా (ముఖ్యంగా) కాళ్లలో బలం తగ్గి వంగిపోతాయి. అలాంటి వారి చేతులు, కాళ్ల ఎముకలు సాగుతున్నట్టుంటాయి. వారికి నడక ఎంతో కష్టమై పోతుంది. యుక్తవయసు ఆడపిల్లలకైతే ఈ లోపంతో కటి (తొడ) ఎముకలు రూపొందడంలోనే అస్థిరత్వం ఏర్పడే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాంటి మహిళలు బిడ్డకు జన్మనివ్వడం (ప్రసూతి) మరింత కష్టమవుతుందని వారంటారు. తర్వాత కూడా ఆ స్త్రీల కటి ఎముకలు బలహీనపడతాయి. శరీరం బరువును ఎముకలు భరించలేని స్థితిలో వారి నడుం వంగిపోతుంది. ఇలాంటి వారికి నడిచే వేళ భరింపరాని నొప్పి వస్తుంది. దీనినే వైద్య పరిభాషలో ‘ఆస్టియోమలేసియా’గా పిలుస్తారు.

బరువు తగ్గాలన్నా, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ఎండుకొబ్బరి తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండుకొబ్బరి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కూడా. దీంట్లో ఫైబర్, కాపర్, సెలీనియం వంటి పోషకాలుంటాయి. వంటకాల్లో వాడే ఎండుకొబ్బరిని రోజూ తినాలంటున్నారు వైద్యులు.ఎండుకొబ్బరిలో ట్రాన్స్ఫ్యాట్స్ ఎక్కువనే ఉద్దేశంతో కొంతమంది తినరు. కానీ ఎండుకొబ్బరి తింటే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది-ఎండుకొబ్బరి తరచూ తినే వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ 50 గ్రాములు ఎండుకొబ్బరి తింటే క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడవచ్చు. పేగుల్లో క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్కు మందులా పనిచేస్తుంది.రోజూ చిన్న కొబ్బరి ముక్క తింటే మలబద్ధకం, అల్సర్ వంటి సమస్యలు పరిష్కారమవుతాయి. మహిళల్లో ఎండుకొబ్బరి తినడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరిగి రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.వయసుతో సంబంధం లేకుండా రోజూ కొంచెం ఎండుకొబ్బరి, బెల్లం తింటే మంచిది. మగవాళ్లు రోజూ 48 గ్రాములు, ఆడవాళ్లు రోజూ 25 గ్రాములు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.కొబ్బరి తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఎండుకొబ్బరిలోని పోషకాలు మెదడులో ‘మైలీన్’ అనే న్యూరో ట్రాన్స్మీటర్ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా మెదడులో సంకేతాల ప్రసార వేగం పెరుగుతుంది. ఫలితంగా మెదడు చురుకుగా పనిచేస్తుంది.