WorldWonders

భారత్‌లో సగటు నేరాల సంఖ్య భయం కలిగిస్తుంది

Crime Stats In India 2019-Average Crime Rates Are High

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా దేశంలో నేరాలు ఆగట్లేదు. చిన్న చిన్న ఘటనలకే క్షణికావేశంలో ప్రాణాలు తీయడం.. అమ్మాయిలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. 2018లో దేశవ్యాప్తంగా సగటున రోజుకు 80 హత్యలు, 289 కిడ్నాప్‌లు, 91 అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక వెల్లడించింది. 2018లో మొత్తంగా 50,74,634 నేర ఘటనలు చోటుచేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ డేటా తెలిపింది. 2017లో నమోదైన 50,07,044 ఘటనలతో పోలిస్తే ఇది 1.3శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇక 2018లో నమోదైన కేసుల్లో 29,017 హత్య ఘటనలున్నాయి. చాలా కేసుల్లో గొడవలు, పాత కక్ష్యలే హత్యలకు దారితీసినట్లు నివేదిక పేర్కొంది. 2017తో పోలిస్తే 2018లో కిడ్నాప్‌ కేసుల సంఖ్య 10.3శాతం పెరిగి 1,05,734 ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు తెలిపింది. మహిళలపై నేరాలు కూడా పెరిగాయి. ఈ కేటగిరీలో 2018లో మొత్తం 3,78,277 కేసులు నమోదకాగా.. వీటిలో 33,356 అత్యాచార కేసులున్నాయి. 2017లో 32,559 రేప్‌ కేసులు నమోదయ్యాయి.