NRI-NRT

టొరంటోలో సంక్రాంతి తీన్మార్

Sankranthi And Teenmar In Toronto By TCA

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు టొరంటోలోని విలియంస్ పార్కువే సెకండరి పాఠశాల ఆడిటోరియంలో సంక్రాంతి తీన్మార్ వేడుకలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఒంటారియో పార్లమెంట్ సభ్యులు దీపక్ ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భోగిపళ్లతో చిన్నారులను ఆశీర్వదించారు. ముగ్గుల పోటీలో ప్రమీళ మోహన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టొరంటో సమయంతో నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో ఇషాన్, శ్రేయ చౌదరి, దియా నేరెళ్లపల్లి, రిత్యారెడ్డిలు బహుమతులు గెలుచుకున్నారు. అనంతరం విందు భోజనం అలరించింది. కార్యక్రమంలో ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీనివాసు తిరునగరి, ట్రస్టీ బోర్డు అధ్యక్షులు హరి రావుల్, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శి శ్రీనివాస్ మన్నెం, కోశాధికారి దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్షి దీప గజవాడ, డైరెక్టర్లు మూర్తి కలగోని, గణేశ్ తెరాల, ట్రస్టీలు సురేశ్ కైరోజు, వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, కిరణ్ కుమార్ కామిశెట్టి, నవీన్ ఆకుల, ఫౌండర్లు కోటేశ్వరరావు చిత్తలూరి, చంద్ర స్వర్గం, దేవేందర్ రెడ్డి గుజ్జుల, రాజేశ్వర్ ఈద, అథీక్ పాష, ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, సంతోష్ గజవాడ, కలీముద్దిన్, ప్రకాశ్ రెడ్డి చిట్యాల, శ్రీనాథ్ కుందూరి తదితరులు పాల్గొన్నారు.