Devotional

షిర్డీ బంద్ ఉపసంహరణ

Shirdi Bandh Is No More-Uddhav Thakre Pathri Creates Chaos

షిరిడీలో బంద్ విరమిస్తున్నట్లు షిర్డీ ప్రజలు ప్రకటించారు. సోమవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

అంతకు ముందు షిరిడీ గ్రామస్థులు ఇవాళ బంద్ చేపట్టారు. బంద్‌ సమయంలో అలయ పరిసరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు మూసి ఉన్నాయి. అయితే దర్శనాలు, పూజలు యథావిధిగా కొనసాగాయి. బంద్ ప్రభావం ఆలయంపై ఉండబోదని ఆలయ ట్రస్టు ప్రకటించింది.

సాయిబాబా జన్మస్థలమైన పత్రిలో భక్తుల సౌకర్యార్థం భవనాల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామంటూ సీఎం ప్రకటించడంతో షిర్డీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పత్రి అభివృద్ధితో షిర్డీ ఆలయ ప్రాశస్త్యం తగ్గిపోతుందేమోనని షిరిడీ, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పత్రి సాయిబాబా జన్మస్థలమన్న వ్యాఖ్యలను ఉద్ధవ్‌ ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.