Movies

రెండో పెళ్లి

Manchu Manoj Reacts On Second Wedding Issue

హీరో మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక సమస్యలపై స్పందించడమే కాకుండా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. వ్యక్తిగత కారణాల వల్ల కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్‌.. తాజాగా ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘నేను త్వరలోనే ఫైర్‌ బాల్‌లా మీ ముందుకు రానున్నాను. వారం రోజుల్లోనే ఓ ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకుంటాను. వెయిట్‌ చెయ్యండి’ అని పేర్కొన్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ కామెంట్లు చేశారు. అయితే కొందరకు మాత్రం.. కొత్త సినిమా ప్రారంభిస్తున్నారా?, మరో పెళ్లి చేసుకుంటున్నారా? అని మనోజ్‌ను ప్రశ్నించారు. అందులో నరేష్‌ మిర్యాల అనే ట్విటర్‌ యూజర్‌ ప్రశ్నకు మనోజ్‌ సమాధానం ఇచ్చారు. ఇంకో మ్యారేజ్‌? అని నరేశ్‌ అడగ్గా.. మనోజ్‌ వామ్మో అంటూ సమాధానమిచ్చారు. కాగా, 2015లో మనోజ్‌, ప్రణతిరెడ్డిల వివాహం జరగగా.. గతేడాది వారిద్దరు విడాకులు తీసుకున్నారు.