Fashion

షాంఫు బదులు బూడిద

Replace Shampoo With Ash To Wash Your Hair-Telugu Fashion And Beauty Tips

ఆధునిక జీవనంలో కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. యాంత్రిక జీవనంలో అన్నీ యంత్రాలతో తయారుచేసిన వస్తువులనే వాడుతున్నాం. ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుడు కాయలు వాడేవారు గంటలు సేపు చేయలేమని వాటి జోలికి వెళ్లటం లేదు. కుంకుడు కాయలు నానాబెట్టి, వాటి రసంతో రుద్దుకోవటం అంటే కనీసం గంటసేపు వెచ్చించాల్సిన పరిస్థితి. కాబట్టి అంత సమయాన్ని వెచ్చించే ఓపిక, తీరిక లేక రూపాయితో షాంపు కొనుక్కొని తలంటుకోవటం నేడు సర్వసాధారణంగా మారింది. అయితే సడెన్‌గా షాంపూ వాడకం ఆపేస్తే ఏవౌతుందని చాలామంది అనుకుంటారు. ఏమీకాదు. ఇంకా మంచిదేనని వైద్యులు అంటారు. వాస్తవానికి తల వెంట్రుకలకు నూనె రాసుకోవాల్సిన అవసరం లేదంటారు నిపుణులు. ఎందుకంటే వెంట్రుకలు వాటంతట అవే నూనెను తయారుచేసుకునే సామర్ధ్యాన్ని కలిగివుంటాయి. అందుకే ప్రత్యేకంగా తలకు నూనె బాగా దట్టించి కొంతమంది తలస్నానం చేస్తారు. కాని అంత శ్రమ అవసరం లేదు అంటారు. కాని షాంపూల వాడకం వల్ల జుత్తు గడ్డిగా మారిపోయి జుత్తు కుదుళ్లు ఆయిల్‌ను ఉత్పత్తిచేసుకునే స్వభావాన్ని కోల్పోతుందని చెబుతున్నారు. అలాగే కొన్ని నెలలు తరువాత జుత్తు ఆరోగ్యంగా తయారవుతోంది. షాంపూలను కెమికల్స్‌తో తయారుచేస్తారు. అందువల్ల వీటి వల్ల సహజ స్వభావాన్ని కోల్పోయి అసహజంగా మారుతుంది.పనసతో జుత్తు రాలటం తగ్గుతుంది.. కాగా పసందైన పనసతో పట్టులాంటి జుత్తు రాలటాన్ని అరికట్టవచ్చు. తల దురద వంటి సమస్య నివారణకు పనస గింజలు చక్కగా పనిచేస్తాయి. ఈ గింజలను ఎండబెట్టి పొడిచేసి పెట్టుకుని, ఆ తరువాత ఒకటిన్నర చెంచాల పనస గింజల పొడి, ఒక చెంచా పెసరపొడి, నువ్వుల నూనె కలిపి తలకు రాసుకుని పది నిమిషాల తరువాత శీకాయతోగానీ, కుంకుడు కాయలతోగానీ కడుక్కోవాలి. దీనివల్ల దురదలు, జుట్టు రాలటం తుగ్గుతుంది. పనస తొనను మెత్తగా మిక్సీలో రుబ్బి ఆ ముద్దను కళ్లపైన రాసుకుంటే కళ్లకు మంచి మెరుపు వస్తుంది. పనస ఆకులు, కాయలు, పండ్లు, పనసకు సంబంధించిన ప్రతిదీ మంచి సౌందర్యపోషణకు ఉపయోగపడతాయి. అమ్మవారు పోసినపుడు ముఖంపై అలర్జీ వంటివి వచ్చినపుడు ఏర్పడే మచ్చలకు పనస ఆకులు బాగా పనిచేస్తాయి. లేత పనస ఆకులను నిప్పులపైన కాల్చి బూడిద చేసి దానిని కొబ్బరినూనెలో రంగరించి, దురదలు, అలర్జీ, మచ్చలు ఉన్నచోట ప్రతిరోజూ రాసుకుంటే కొన్ని రోజులకు అవి క్రమంగా మాయమైపోతాయి. ముఖం, చర్మం, కాంతివంతమై సుందరంగా తయారవుతుంది. అలాగే యాభై సంవత్సరాలు పైబడినవారు పండిన నగం పనస తొన, ఒక అరటిపండు ముక్క, ఒక చెంచా శనగపిండి, పాలు తీసుకుని బాగా మెత్తగా చేసి దానిని మెడపైన రాసుకుంటే వయసు పెరుగుదల వల్ల వచ్చే ముడతలు వంటివి పోతాయి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. పనస తొనను నానబెట్టి దానికి తేనె కలిపి ముఖానికి చేతులకు రాసుకుని ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం తళతళలాడుతూ మెరుస్తూంటుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు నాలుగు పనస గింజలను నిప్పుల మీద కాల్చి తింటే ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది. పొట్టపైకి రాకుండా తగ్గుతుంది. కొందరిది శరీరం వేడిగా ఉంటుంది. ఇలాంటివారు ఏ చిన్న పనిచేసినా అలసిపోతారు. ఇలాంటి సమస్య ఉన్నవారు పనస ఆకులతో కుట్టిన విస్తరిలో వేడివేడిగా భోజనం చేస్తే శరీరంలోని వేడి తగ్గి సమస్యలు పోయి, శరీరానికి కొత్త శక్తి వస్తుంది.