NRI-NRT

చంద్రబాబుకు తాళ్లూరి రాజా ఆహ్వానం

చంద్రబాబుకు తాళ్లూరి రాజా ఆహ్వానం-Talluri Raja Invites Chandrababu To Wedding

లూసియానాకు చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖులు డా. తాళ్లూరి రాజాశ్రీకృష్ణ-గాయత్రిదేవిల కుమార్తె శ్రీపూజ వివాహం 7వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటరులో ఎంపీ సీ.ఎం.రమేశ్ కుమారుడు రిత్విక్‌తో జరగనుంది. వీరి వివాహ ఆహ్వాన పత్రికను శుక్రవారం నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి కుటుంబసమేతంగా రావల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాజా సోదరుడు, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ కూడా పాల్గొన్నారు.