Movies

అధరచుంబనం ఎందుకు తప్పు?

Why is a liplock wrong-Aishwarya Rajesh questions

‘‘నేను తెలుగమ్మాయినే అయినా… పెరిగింది తమిళనాడులో కాబట్టి. ఇక్కడి జనాలకు ఇంకా దగ్గర కాలేదు. మాతృ భాషలో నటించాలని ఎంత కోరిక ఉన్నా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. ఇప్పుడే కెరీర్ మొదలైంది కాబట్టి కొంచెం సమయం పడుతుంది. ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుని తెలుగువారికి దగ్గరవుతా’’ అని ఐశ్వర్యా రాజేశ్ అన్నారు. ఆమె కథానాయికగా క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేశ్ శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు.నేను తెలుగులో అంగీకరించిన తొలి సినిమా ఇది. రెండేళ్ల క్రితం క్రాంతి మాధవ్ ఈ కథ చెప్పారు. సువర్ణ పాత్ర గురించి ఓ అవగాహనకు వచ్చాక ‘మీరు తీస్తుంది తెలుగు సినిమానేనా’ అని దర్శకుణ్ణి అడిగా. ఎందుకంటే తెలుగు సినిమాలో కథానాయికలంటే గ్లామర్గా, కలర్ఫుల్గా ఉండాలి. ఇందులో నాదేమో అందుకు భిన్నమైన పాత్ర కావడంతో ఆ అనుమానం వచ్చింది. నేను ఏ సినిమా అంగీకరించినా రెండు ఓ రోజులపాటు క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటా. విజయ్, నాకూ మధ్య సీన్స్ బాగా వచ్చాయంటే మేమిద్దరం చేసిన ప్రాక్టీస్ కారణం. విజయ్తో సినిమా అనగానే లిప్లాక్లు తప్పనిసరిగా ఉంటాయి అంటూ ఎంతోమంది ఎన్నో రకాలు చెప్పారు. అలాంటి ఒక్క కోణం ఆయనలో చూడలేదు. కథకు అవసరమైతే లిప్లాక్ చేయడంలో తప్పేముంది. ఇందులో నటించిన నలుగురు హీరోయిన్లలో ఎవరి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందనేవి సినిమా చూస్తేనే తెలుస్తుంది. నాని-‘శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న సినిమాతో తప్పకుండా ప్రేక్షకులకి చేరువవుతా. నా కోసం రచయితలు, దర్శకులు మంచి పాత్రలో రాస్తారో లేదో చూడాలి’’ అని అన్నారు.