Devotional

రేపటి నుండి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లు

Penuganchiprolu Tirunallu 2020-Telugu Devotional News

1.రేపటి నుంచి తిరుపతమ్మ పెద్దతిరునాళ్లు – ఆద్యాత్మిక వార్తలు – 07/02
పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో శనివారం నుంచి పెద్దతిరునాళ్లు ప్రారంభంకానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు ఆలయ అధికారులు, ధర్మకర్తలు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవంలో ప్రధానమైన శ్రీతిరుపతమ్మ, గోపయ్య స్వాముల వారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఉత్సవం తొలిరోజు శనివారం రాత్రి 9.25 గంటలకు ఆలయ ప్రాంగణంలో భద్రాచలం శ్రీసీతారాములవారి కల్యాణం తరహలో కల్యాణ వేడుక చేస్తారు. అమ్మవారి మండల దీక్షలు తీసుకున్న భక్తులు దీక్షల విరమణ చేస్తారు. దేవాలయం వద్ద సుమారు లక్షమంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. 9న జలబిందెల మహోత్సవం, 10న ఉదయం అంకమ్మ తల్లికి పొంగలి చేసి పూజలు చేస్తారు. గ్రామానికి చెందిన రజకులు, కుమ్మర్లు కలిసి బోనం చేసి అమ్మవారికి ఆరగింపు చేస్తారు. 11న దీవెన బండారు కార్యక్రమం, 12న పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు.
2.అలిపిరి మార్గంలో కొత్త పైకప్పు
అలిపిరి-తిరుమల మెట్ల మార్గాన్ని ఆధునికీకరించాలని తితిదే నిర్ణయించింది. అవసాన దశకు చేరుకుంటున్న ప్రస్తుత కాంక్రీట్ స్లాబును పూర్తిగా తొలగించి గాల్వలూమ్ షీట్లతో కొత్త రూపు తీసుకురానుంది. ఈ ఖర్చును భరించేందుకు రిలయెన్స్ సంస్థ ముందుకు రాగా… ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తిరుమలేశుడి చెంతకు నడిచి వస్తామని మొక్కుకున్న భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో తిరుమలకు చేరుకోవచ్చు. అలిపిరి దారిలోనే రోజుకు సుమారు 20 వేల మంది నడిచి వెళ్తుంటారు. వీరిపై వర్షం, ఎండ ప్రభావం పడకుండా 30 ఏళ్ల క్రితం ఈ దారిలో తితిదే కాంక్రీటు స్లాబు నిర్మించింది. ప్రస్తుతం అది దెబ్బతిని, పలుచోట్ల పెచ్చులు ఊడుతున్నాయి. ఆ స్లాబును పూర్తిగా తొలగించి.. గాల్వలూమ్ షీట్లు వేయాలని తితిదే ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇందుకు సుమారు రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఈ మొత్తాన్ని భరించేందుకు రిలయెన్స్ ముందుకొచ్చింది. శ్రీవారి మెట్టు మార్గంలో నాలుగేళ్ల క్రితమే ఈ షీట్లు వేయగా… అవి మంచి ఫలితాన్నిస్తున్నట్లు గుర్తించారు. అలిపిరి మార్గం 7.8 కి.మీ దూరం కాగా.. 3550 మెట్లు ఉన్నాయి. సిమెంటు స్లాబు 20 మీటర్లు వేసే సమయంలో గాల్వలూమ్ షీట్లను 1 కి.మీ వరకు పరచవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రాయోజకకర్తగా వ్యవహరిస్తున్న రిలయెన్స్ సంస్థే.. నేరుగా గుత్తేదారుకు పనులు అప్పగించనుంది. తితిదే పర్యవేక్షించనుంది.
3.ఏప్రిల్లోనే సుముహూర్తం
శ్రీరామనవమి లేదా అక్షయ తృతీయ రోజున ఆలయ పనులకు శ్రీకారం
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి(ఏప్రిల్ 2) రోజునగానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్ 26) నాడుగానీ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం’ ట్రస్టీ స్వామి గోవింద్ దేవగిరి మహరాజ్ వెల్లడించారు. ఈ రెండింటిలో ఏ రోజున ప్రారంభించాలన్నదానిపై ట్రస్టు తొలి భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పుణెలో బుధవారం ఈ మేరకు ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘అయోధ్యలో రామాలయాన్ని చాలామంది కోరుకున్నారు. ఆ మందిరం కేవలం శ్రీరాముడికి అంకితమిచ్చే స్మారకం కాదు. మనదేశ చిహ్నంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను విశ్వహిందూ పరిషద్(వీహెచ్పీ) దివంగత నేత అశోక్ సింఘాల్, కరసేవకులకు దేవగిరి మహరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
4.రూ.1 విరాళమిచ్చిన కేంద్రం
మందిర నిర్మాణ పనులు ప్రారంభించేందుకుగాను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని నగదు రూపంలో విరాళంగా అందించింది. ప్రభుత్వం తరఫున కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ డి.ముర్ము దాన్ని అందజేశారు. ట్రస్టుకు వచ్చిన తొలి విరాళం ఇదే. విరాళాలు, గ్రాంట్లు, సబ్స్క్రిప్షన్లు, సహాయాలతోపాటు స్థిరాస్తులను సైతం ఎవరి నుంచైనాసరే ట్రస్టు షరతుల్లేకుండా స్వీకరిస్తుందని అధికారులు తెలిపారు.
5. రేపు యాదాద్రి శ్రీవారి కల్యాణమహోత్సవం
పాతగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు మహోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం, నిశ్చయ తాంబూలాలకు ఒప్పందం కుదిరింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు కల్యాణ సుముహూర్త ఘడియలుగా నిర్ణయించారు. నృసింహుడికి వరపూజ, వధువు శ్రీలక్ష్మీదేవికి పూలు, పండ్లు కార్యక్రమం కన్నులపండువుగా అర్చకబృందం జరిపారు. పట్టువస్ర్తాల అలంకరణలతో అశ్వవాహన సేవపై శ్రీనారసింహుడు, ముత్యాల పల్లకి ద్వారా లక్ష్మీదేవి ఆలయం నుంచి భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా బయల్దేరారు. మేళతాళాల నడుమ ప్రధాన మండపానికి చేరారు. ఎదురెదురుగా స్వామి, అమ్మవార్లను అధిష్టింపచేసి…శ్రీవారి వైపు ఆలయ ఈఓ ఎన్.గీత, అమ్మవారి వైపు ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నర్సింహమూర్తి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు వైష్ణవ సంప్రదాయ రీతిలో సంబంధం ఖాయమైన ఈ కార్యక్రమాన్ని అర్చకస్వాములు, వేదపండితులు, యాజ్ఞీకులు తదితరులు కలిసి కల్యాణ ఒప్పందాన్ని కుదిర్చారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు దోర్బల భాస్కరశర్మ, జూశెట్టి కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
6. మల్లన్న బ్రహ్మోత్సవాలు.. మదిదోచే సంబరాలు- 21న మహాశివరాత్రి పర్వదినం
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. 14వ తేదీన ఉదయం 8.30 గంటలకు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, ఆలయ ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్ఠాపన, అంకురార్పణ, రాత్రి 7 గంటలకు త్రిశూల పూజ, భేరీ పూజ, భేరీ తాండవం, సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ చేయనున్నారు.
**విశేష కార్యక్రమాలు
15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజూ గ్రామోత్సవం
17న సాయంత్రం 6.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
18న సాయంత్రం 6.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
21న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం
22న రాత్రి 8 గంటలకు స్వామి, అమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం
**స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు
15న భృంగి వాహన సేవ
16న హంస వాహన సేవ
17న మయూర వాహన సేవ
18న రావణ వాహన సేవ
19న పుష్ప పల్లకీ సేవ
20న గజ వాహన సేవ
21న నంది వాహన సేవ
22న రథోత్సవం
24న అశ్వవాహన సేవ
**దర్శనం వివరాలు
ఈనెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను నిలుపుదల చేయనున్నారు.
జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు మాత్రమే 14వ తేదీ నుంచి 18వ తేదీ రాత్రి 7.30 గంటల వరకు స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు.
14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సాధారణ భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం కల్పిస్తారు.మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనాన్ని 18వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి నిలుపుదల చేస్తారు. 24వ తేదీ వరకు స్పర్శ దర్శనం నిలుపుదల చేసి ఉంటుంది.
వీఐపీ బ్రేక్ దర్శనాలను మూడు విడతల్లో గేట్ నెం.2 హరిహరరాయ గోపురం ద్వారం నుంచి అనుమతిస్తారు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1 గంట వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు.
7. ఆధ్యాత్మికంవిద్వత్‌
కొందరు చేపట్టిన పనులను ఎంతో ప్రావీణ్యంతో ముగించి ప్రశంసాపాత్రులు అవుతారు. వారిలో ఆత్మవిశ్వాసమే కార్యసాధనలో తగినంత బలాన్నిస్తుంది. పలువురి ప్రశంసలకు యోగ్యమైన ఆ స్థితికి తమ సొంత ప్రతిభే మూలం అనుకుంటే మాత్రం అది అహంకారానికి కారణమవుతుంది. తన జన్మకుగాని, తనలో విద్వత్తుకుగాని భగవంతుడే మూలం అనే ఎరుకతో ఉంటే- ఏ కార్య సఫలతలోనూ అహంకారం కలగదు. ఎంతటివారికైనా అహంకారమే పురోభివృద్ధికి ప్రతిబంధకం అవుతుంది.ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య అంతరాన్ని గుర్తించడం చాలా కష్టం. సాధారణంగా ఎదుటివ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా, తన అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా పొరబడే అవకాశం చాలా ఉంటుంది. పురాణ కథల్లో అనేక ముఖ్యపాత్రల గర్వభంగ వృత్తాంతాలు కనిపిస్తుంటాయి. అవన్నీ నిజజీవితంలో జాగ్రత్తపడటానికి మార్గదర్శకాలు. అహంకార నివృత్తికి చిత్తశుద్ధితో కూడిన ఆత్మపరిశీలన అవసరం.జీవులన్నింటిలో బతుకుతెరువుకు కావలసిన విద్వత్‌ సహజసిద్ధమై ఉంటుంది. ఎటువంటి కార్యసాధనకైనా నేపథ్యంలో భగవత్‌ ప్రసాదితమైన విద్వత్‌ ప్రభావం ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనేది ఒకటి. అనిర్వచనీయమై సర్వత్రా వ్యాపించి ఉన్న క్రియాశక్తే విద్వత్‌. విద్వత్‌ వినియోగంతో కలిగే అద్భుతమైన ఫలితాలే లోకంలో ప్రశంసలకు కారణాలు. భగవత్‌ భక్తితో, నిరహంకారమైన నిరంతర సాధనతో అది పెంపొందుతుంది.గణితశాస్త్రంలో విద్వత్తుతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీనివాస రామానుజం తన ఇష్టదేవతైన నామాదేవిని ఆరాధించి అనేక క్లిష్టమైన సమస్యల సాధన చేసినట్లు ప్రతీతి. సాధారణంగా సంగీతవిద్వాంసులు, నటులు, సాహితీవేత్తలు, అవధానశ్రేష్ఠులు మొదలైనవారు విద్వత్‌ కలవారనే మాట వినిపిస్తుంటుంది. చతు్షష్టి కళల్లో దేనిలో ప్రతిభ గడించినా దానికి వారిలో విద్వత్తే మూలం. ఒకేసారి విన్నా గుర్తుంచుకునే శక్తిగలవారిని ఏకసంథాగ్రాహులు అంటారు. చదువూసంధ్యా లేని గ్రామీణుల్లో సైతం అలాంటి వారుంటారు.ఏ సంగీత సాధనా అవసరం లేకుండానే శ్రుతిశుద్ధంగా, లయబద్ధంగా పాటలు, పద్యాలు పాడటం కొందరి విద్వత్తు. రకరకాల గారడి విద్యలను ప్రదర్శించడానికి, సన్నటితాడుపై నడవడానికి, రకరకాల విన్యాసాలు చేయడానికి వారిలోగల విద్వత్తే మూలం. చేతికి దొరకకుండా నీటిలో ఈదే చేపలు, ఆహారం దాచుకుంటూ పుట్టల్లో జీవించే చీమలు, బారులుగా గాలిలో ఎగిరే పక్షులు, వాటి గూళ్ల నిర్మాణాలు సైతం జీవుల్లో గల భగవద్దత్తమైన విద్వత్తుకు కొన్ని ఉదాహరణలు.జీవితం అంటే వ్యక్తిగత అనుభవాల రీత్యా కల, మాయ, నాటకం, ఆట, పోరాటం వంటిదనే ఎన్నో రకాల అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. జీవితం పరమాత్మ బహూకరించిన వరం. సహజసిద్ధమైన విద్వత్తుతో ఆహ్లాదభరితం చేసుకునే అవకాశం, అవకాశ వినియోగంలో అంతరమే- మనిషి చవిచూసే సుఖదుఃఖాలకు కారణం. సామాజిక శాంతికి, ఐక్యతా సాధనకు వినియోగించే విద్వత్‌ పరమాత్మకు సన్నిహితుణ్ని చేస్తుంది.యోగుల జీవనవిధానం- నేను, నా కుటుంబం అనే సంకుచిత స్వభావం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది. చిత్తశుద్ధిగల యోగుల విద్వత్తుకు భగవంతుడి అండదండలే బలం. దేశాభ్యుదయం కోసం కర్మయోగిగా, అవిశ్రాంతంగా కృషిచేసేవారి ధర్మనిరతే దేశవాసులందరికీ రక్షణ కవచం. ఆ స్ఫూర్తితో జీవించడం నిజాయతీగల దేశభక్తుల విధి.విద్వత్‌ వినియోగంలో మెలకువ ఉంటే ఆధ్యాత్మిక జీవనంలో ప్రధానమైన నిష్కామకర్మ అలవడుతుంది. అప్పుడు ఏ కార్యం సంకల్పించినా సాధించడం కరతలామలకం అవుతుంది.
8. మే నెలకు సంబంచి భక్తులకు అందుబాటులో 72,773 ఆర్జిత సేవాటికెట్లు –
ఆన్‌లైన్ డిప్ విధానంలో -11,498
సుప్రభాతం – 8,143,
తోమాల సేవ – 120,
అర్చన – 120,
అష్టదళపాదపద్మారాధన – 240,
నిజపాద దర్శనం – 2,875
ఆన్‌లైన్ జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 61,275 ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
విశేషపూజ – 2000,
కల్యాణోత్సవం – 14,725,
ఊంజల్‌ సేవ – 4,650,
ఆర్జిత బ్రహ్మూత్సవం-7,700,
వసంతోత్సవం-15,400,
సహస్రదీపాలంకార సేవ – 16,800.
9. శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన నిమిత్తం టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ధర్మారెడ్డి శుక్రవారం జమ్మూకు వెళ్లనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసితోపాటు జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ బోర్డు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.స్థల కేటాయింపుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. జమ్మూలో రెండు మూడు స్థలాలు టీటీడీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. దీంతో స్థల పరిశీలనకు ఈవో, అదనపు ఈవో, చీఫ్‌ ఇంజనీర్‌ శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమ అనంతరం బయలుదేరనున్నట్టు తెలిసింది.
10. ఫిబ్‌దవ‌రి 7న‌ డయల్‌ యువర్‌ ఈవో
తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.కాగా, మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని కోరడమైనది.తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
11. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2020 మే నెలకు సంబంధించి 72,773 టికెట్లను విడుదల చేసింది. ఆన్‌లైన్‌ డిప్‌ విధానం కింద 11,498 సేవా టికెట్లు, డిప్‌ పద్ధతిలో సుప్రభాత సేవకు 8,143, తోమాల సేవ 120, అర్చన 120, అష్టాదళ పాదపద్మారాధన సేవకు 240, నిజపాద దర్శనం కోసం 2,875 టికెట్లను తితిదే కేటాయించింది. సాధారణ పద్ధతిలో 61,275 టికెట్లను అందుబాటులో ఉంచగా అందులో విశేష పూజకు 2,000, కల్యాణోత్సవం 14,725, ఊంజల్‌ సేవ 4,650, వసంతోత్సవం 15,400, సహస్ర దీపాలంకరణ కోసం 16,800, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700 టికెట్లను తితిదే విడుదల చేసింది.
12. తిరుమల: శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన నిమిత్తం టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ధర్మారెడ్డి శుక్రవారం జమ్మూకు వెళ్లనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసితోపాటు జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ బోర్డు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.స్థల కేటాయింపుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. జమ్మూలో రెండు మూడు స్థలాలు టీటీడీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. దీంతో స్థల పరిశీలనకు ఈవో, అదనపు ఈవో, చీఫ్‌ ఇంజనీర్‌ శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమ అనంతరం బయలుదేరనున్నట్టు తెలిసింది.
13. శుభమస్తు
తేది : 7, ఫిబ్రవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి
(నిన్న రాత్రి 8 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 26 ని॥ వరకు)
నక్షత్రం : పునర్వసు
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 19 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 57 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 12 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 8 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 9 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 11 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 48 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 28 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 36 ని॥ వరకు)
యగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 46 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 13 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : మిథునము
విశేషం
14. చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 7*
జె.హెచ్.హార్డీ
1812: ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం.
1877: ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ జననం.
1888: ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం.
1897: ప్రముఖ ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఫెరారిస్ మరణం.
1969: స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు మరియు చలనచిత్ర దర్శకులు ఆమంచర్ల గోపాలరావు మరణం.
1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం
15. పంచాంగము 07.02.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: శుక్ల
తిథి: త్రయోదశి సా.04:57 వరకు
తదుపరి చతుర్దశి
వారం: శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం: పునర్వసు రా.11:03 వరకు
తదుపరి పుష్యమి
యోగం: ప్రీతి రా.10 30 వరకు
తదుపరి అయుష్మాన్
కరణం: కౌలవ రా.01:26 వరకు
తదుపరి వణజి
వర్జ్యం: ఉ. 11:21 – 12:55 వరకు
దుర్ముహూర్తం: ఉ.09:04 – 09:50
రాహు కాలం: 11:04 – 12:30
గుళిక కాలం: 08:13 – 09:38
యమ గండం: 03:22 – 04:48
అభిజిత్ : 12:07 – 12:53
సూర్యోదయం: 06:47
సూర్యాస్తమయం: 06:14
చంద్రోదయం: సా. 04:18
చంద్రాస్తమయం: రా. 05:49
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: పడమర
విద్యారణ్య జయంతి
వరాహ కల్పాది
విశ్వకర్మ జయంతి
గురు గోరఖ్ నాథ్ జయంతి
శ్రీ హరరాయ జయంతి
16. రాశిఫలం – 07/02/2020
తిథి:
శుద్ధ త్రయోదశి సా.4.30, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
పునర్వసు రా.10.43
వర్జ్యం:
ఉ.10.55 నుండి 12.29 వరకు, తిరిగి రా.తె.6.27 నుండి
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు
రాహు కాలం:
ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశముంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా నుండుట మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలుండవు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు, మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్ర్తిల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా నుండుట అవసరం.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యలనెదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది.
17. *శుక్ర ప్రార్థన
*||హిమకుంద మృణాలాభం|
*||దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవ౦|*
*||తం ప్రణమామ్యహం*
సంవత్సరం: శ్రీ వికారి నామ సంవత్సరం
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర ఋతువు
మాసము: మాఘ మాసము
పక్షం: శుక్ల పక్షం
తిధి: త్రయోదశి సా.04:38 వరకు తదుపరి చతుర్దశి
వారం: భృగువాసరే (శుక్రవారము)
నక్షత్రం: పునర్వసు రా.10:46 వరకు తదుపరి పుష్యమి
యోగం: ప్రీతి రా.09:31 వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతుల సా.04:38 వరకు తదుపరి గరజి రా.తె.05:58 వరకు
సూర్యోదయం: 06:35
సూర్యాస్తమయం: 05:52
సూర్యరాశి: మకరం
చంద్రరాశి: మిథునం
అభిజిత్: మ.12:07 – 12:53 వరకు
అమృతకాలం: రా.08:24 – 09:59 వరకు
వర్జ్యం: ఉ.10:56 – 12:31 పునః రా.తె.06:30 ల.
దుర్ముహూర్తం: ఉ.08:49 – 09:34 పునః మ.12:35 – 01:20 వరకు
రాహుకాలం: ఉ.10:30 – 12:00 వరకు
యమగండం: మ.03:00 – 04:30 వరకు
గుళ్ళిక కాలం:ఉ.07:30 – 09:00 వరకు
18. మదురై కామాక్షి
కంచి కామాక్షీ , మదురై మీనాక్షి , కాశీ విశాలాక్షి అని అనికదా చెప్తారు, మరి , మదురై కామాక్షి అంటున్నారని వింతగావుందా !మీనాక్షి కొలువై వున్న మదురైలో ఒక ప్రాచీనమైన, విశిష్టత కలిగిన కామాక్షిఆలయం వున్నది.మదురై తెర్క్ మాసి వీధిఅని పిలవబడే దక్షిణ మాసి వీధిలోమరవర్ చావడి అనే చోట కామాక్షిదేవి వెలసివున్నది. కంచిలో వలెనే యిక్కడ కూడా ఏకాంబరేశ్వరుడు వున్నాడు. దీనిని కామాక్షీ ఏకాంబరేశ్వర ఆలయంగాపిలుస్తారు. మొదట్లో మహాకాళి కోసం నిర్మించాలనుకొన్న ఆలయం యిది. ఇప్పుడుకామాక్షీ దేవి ఏకాంబరేశ్వరసమేతంగా యీ ఆలయంలోకొలువై వున్నది. ఈ స్ధలపురాణకధ ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.ప్రవేశద్వారం వద్ద కరుపణ్ణాస్వామి రక్షక దైవం. ఎడమ ప్రక్కన బ్రహ్మా సరస్వతులు , కుడి ప్రక్కన శ్రీ లక్ష్మీ సమేత మహావిష్ణువుదర్శనమను గ్రహిస్తున్నారు.తరువాత అర్ధ మండపంలో కాళికాదేవి, మదురై లో కానీ , మరెక్కడా చూడని విధంగా పంచముఖ గాయత్రిదేవి పదిచేతులు,.మూడు పాదములతో ,అధ్భుతంగానూ , కొంత వ్యత్యాసం గాను గోచరిస్తుంది.వినాయకుని, కుమారస్వామిని నటరాజస్వామిని చూడగలము. శివకామిదేవితోపానవట్టం లేని వలింగంవున్నది. స్వయంభూలింగంగా భూమిలోపల వెలసినది. దీనిని ప్రతిష్టించాలంటే ఆలయ నిర్మాణం మార్చి పూర్తి శివాలయంగా మార్చవలసి వస్తుంది. అందుకని దానినిపానవట్టం లేని శివలింగం గా వదలి వేశారు. గర్భగుడిలోసౌందర్యాధిదేవతగా కామాక్షీదేవి అనుగ్రహిస్తూ వుంటుంది.స్వయంగా వచ్చి వెలసిన దేవి చల్లని చిరునవ్వుతో, ఉత్తరాభి ముఖంగా దర్శనమిస్తుంది.సాధారణంగా అమ్మవారి విగ్రహాలనుశివాలయాలలో దక్షిణ ముఖంగా కాని, తూర్పుముఖంగా కాని ప్రతిష్టించడం ఆచారం.గర్భగుడిలో ఏకాంబరేశ్వరుడుతూర్పు ముఖంగా దర్శనంఅనుగ్రహిస్తున్నాడు. స్వామి సన్నిధిలో నిలబడిదర్శనం చేసుకుంటున్నప్పుడుఏకాంబరేశ్వరుని, కామాక్షీ
దేవిని ఒకేసారి దర్శించే విధంగా, విగ్రహాలు వుండడం యీ ఆలయంలోని ప్రత్యేకత.వెలుపలి ప్రాకారంలో , నవగ్రహాలు, భైరవుడు హనుమంతుడు , రావి చెట్టుక్రింద వినాయకుడు దర్శనమిస్తారు. ప్రాకారం చుట్టి వచ్చాక
ప్రత్యేక మండపంలో హనుమంతుని రూపము వలె వుండే ఒక విగ్రహం, వాలము లేకుండా దర్శనమిస్తుంది. ఈ స్వామిని నలబ్రహ్మ అంటారు. శ్రీ రాముడు లంకకి వెళ్ళడానికిసేతువు నిర్మించే ముందువానర సేనకి నాయకుడైసేవ చేసిన నలునిదే యీ విగ్రహం.విశ్వకర్మ సమూహాధిపత్యంలో వున్న యీ ఆలయంలో జ్యేష్టాభిషేకం , జంధ్యాల పౌర్ణమి మొదలైన ఉత్సవసందర్భాలలో యీ విశ్వకర్మ సమూహం వారు జంధ్యాలు ధరిస్తారు. నవరాత్రి ఉత్సవాలు అత్యంతవైభవంగా జరుపుతారు.
*ఇప్పుడు మదురై కామాక్షి కామాక్షి కధ….
ఒకప్పుడు మీనాక్షి దేవి ఆలయానికిదక్షిణాన దట్టంగా పెరిగిన పెద్ద మామిడి తోట వుండేది.ఆ వనంలో ఒక పర్ణశాలలోవనకాళీ దేవి కొలువై వుండేది. విశ్వకర్మ సమూహమువారు ఆ కాళికా దేవినిఆరాధించే వారు. ఒక పూజారి ప్రతి నిత్యం ఆ వనానికి వచ్చి కాళిదేవికి పూజాపునస్కారాలు చేసి , అడివి జంతువుల వలన అక్కడి ఆలయానికి అందులోని కాళీవిగ్రహానికి ఏవిధమైన ఛ్ఛేదం కలుగ కుండా తలుపులుమూసి వెడుతుండేవాడు. ఒక రోజు ఆ పూజారి చిన్న వాడైన తన కొడుకుని కూడా తీసుకుని
వచ్చాడు .బాలుడు ఆ తోటలోఆడుతూ వుండి పోయాడు.పూజారి నిత్య పూజలు ఆరంభించాడుఅప్పుడు మొదలైనదివిధి లీల. బయట ఆడుకుంటున్న ఆ బాలుడు ఆలయంలోని కాళి విగ్రహంవెనకాల ఆడుతూ అక్కడే నిద్ర పోయాడు. పూజారి తన కొడుకు విషయం మరచి ఆలయానికి తాళం వేసుకొని యింటికి వెళ్ళి పోయాడు. కొడుకుని ఆలయంలో వదలి వేసిన సంగతి ఆ రాత్రికిగాని గుర్తుకురాలేదు ఆ పూజారికి. వెంటనే గాభరాపడుతూ అడవిలోకి పరిగెత్తుకుని వచ్చాడు.అర్ధరాత్రి అని కూడమర్చిపోయి కొడుకునచూడాలనే తొందరలో ఆలయ తలుపులు తెరిచాడు. అక్కడ కాళికాదేవి ఉగ్రదేవతగా సాక్షాత్కరించింది. ఆ ఉగ్ర రూపానికి తాళ లేక ఆ పూజారి స్పృహతప్పిపడి పోయాడు .మరునాడు ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు , స్పృహతప్పి పడిపోయిన పూజారిని , మైమరచి నిద్రిస్తున్న బాలుడికిశుశ్రూష చేసి , సేద తీర్చారు.జరిగిన సంగతి తెలుసుకొనికాళికా దేవికి అక్కడ ఒక పెద్ద ఆలయంని‌ర్మించాలని నిర్ణయించారు.ఆలయం కోసం ఆ అడవిలోత్రవ్వకాలు మొదలుపెట్టినప్పుడు ఒక అపూర్వ సంఘటన జరిగింది.ఒక మామిడి చెట్టు కింద ఒకశివ లింగం కనిపించింది.పానవట్టంలేకుండా లింగరూపమొక్కటే వెలియడం వలన ఏకాంబరమైనది.కాళికా దేవికి ఆలయ నిర్మాణ సమయంలో శివలింగం లభించడ మేమిటని విశ్వకర్మ సమూహము వారు కలవరపడ్డారు. అక్కడ కాళికా దేవి ఆలయమా? శివాలయమా? ఏది వుండాలనే సందేహం కలిగింది. వెంటనే కాంచీ పురమువెళ్ళారు. అక్కడ కామాక్షీ దేవి ఆలయంలో చీటీలు వ్రాసి చూశారు అర్చకులు. అప్పుడు కాళి , శివుడికి బదులుగా కామాక్షీ దేవిపేరు వచ్చింది. ఏకాంబరేశ్వరుడు వున్న చోట కామాక్షీ దేవికే కదా స్ధానం. ఆలయ నిర్మాణం ముగిసింది.ఈ నాటికి అక్కడంగం, కాళికాదేవి విగ్రహాలు దర్శనమిస్తాయి.మంగళ రూపిణి అయిన కామాక్షీ దేవి మదురైకి రావడానికి మరొక పురాణకధ కూడా వున్నది. మదురైలో మీనాక్షి, సుందరేశ్వరుల కళ్యాణంవైభవంగా జరుగుతున్న సమయం. ఆ వివాహంలో కన్యాదానంచేసిన వారు బ్రహ్మదేవుడు. కన్యాదానం చేసిన బ్రహ్మదేవుని కి కానుక సమర్పించాలని మీనాక్షిదేవి ఏం కానుక కావాలి ? అని బ్రహ్మదేవుని అడిగింది.బ్రహ్మదేవుడు , అప్పుడు గర్వంగా, ” సృష్టి కర్తనైన నాచేత కూడా సృష్టించబడనిదిఏదైనా కానుకగా ఇమ్మనికోరాడు.”అలాగా అయితే దరిద్రాన్ని నీకిస్తున్నా స్వీకరించమని” అన్నది మీనాక్షి దేవి.అంతే బ్రహ్మదేవుడు బెంబేలెత్తిపోయాడు.”అమ్మా ! అహంకారంతో నేను తెలియక తప్పు చేసాను, నా గర్వం అణిగిపోయినది తనను క్షమించమనివేడుకున్నాడు. మీనాక్షీ దేవి నవ్వింది .” దిగులు పడకండి , ఇదేమదురైలో నేను కామాక్షీదేవిగా ఆవతరిస్తాను . అప్పుడు మీకు విమోచనంకలిగిస్తాను. అన్నది మీనాక్షిదేవి. కామాక్షీదేవి అవతరించిబ్రహ్మదేవుని అనుగ్రహించిశాప విమోచనం కలిగించింది.ఈనాటికీ కామాక్షీ దేవినిపూజించిన భక్తుల కష్టాలను తీర్చి, కోరికలను నుగ్రహిస్తూ దివ్యమంగళ స్వరూపిణి గా దర్శనంప్రసాదిస్తున్నది. నమ్మి వచ్చిన వారి చేయి నాడు విడువదుకామాక్షీ అని తండోపతండాలుగా ఆలయానికివచ్చే భక్తులే యిందుకు నిదర్శనం.
19. అయోధ్య రామ మందిర ట్రస్టుకు కేంద్రం తొలి విరాళం @ రూ.1
అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చేసింది. నిన్న స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో ట్రస్టుపై ప్రకటన చేశారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్ష్రేత్ర’ అని ట్రస్టుకు పేరు పెట్టినట్లు చెప్పారు. ఈ ట్రస్టు పనులు మొదలుపెట్టే ముందు బుధవారం లాంఛనంగా కేంద్రం విరాళం అందజేసింది. నగదు రూపంలో ఒక రూపాయిని తొలి విరాళంగా ఇచ్చారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి డి.ముర్ము.
20.అయ్యప్ప ఆభరణాల లెక్కింపుకు రిటైర్డ్ జడ్జి నియామకం
శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామీ ఆభరణాల లేక్కిమ్పునకు సుప్రీం కోర్టు నేడు కేరళ హైకోరేటు విశ్రాంత న్యాయమూర్తి సిఎస్ రామచంద్రన్ నాయర్ ను నియమింహింది. నలుగు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు నాయర్ ను ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీం నాలుగు వారాలకు వాయిదా వేసింది పండలం రాజకుటుంబం లోని అంతర్గత కలహాలు వ్యాజ్యలపై దాఖలు నమోడుతో సుప్రీం విచారణ సందర్భంగా ఆరాష్ట్ర దేవదాయశాఖ మంత్రి సురెంద్రన్ సుప్రీంకు వివరణ ఇస్తూ పోలీస్ భద్రత మధ్య ఆదేశిస్తే భద్రతను మారింత పెంచేందుకు తము సిదమేనన్నారు.