DailyDose

హీరో లాభాలు భేష్‌-వాణిజ్యం

Telugu Business News Roundup - Hero Motors Record Profits

* అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్‌ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ త్రైమాసికంలో బలమైన ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌ హీరో మోటో షేరు 3 శాతానికిపైగా లాభాలతో హీరోగా నిలిచింది. అంచనాలకు మించి 2020 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 14.5 శాతం నికర లాభం పెరిగి 880 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 769 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో 17శాతం పుంజుకుని రూ.773 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.905 కోట్లకు పెరిగిందని ఫలితాల సందర్భంగా కంపెనీ వెల్లడించింది.
*మరింత చౌకగా ఎస్‌బీఐ గృహ, వాహన రుణాలు
ప్రభుత్వ రంగానికి చెందిన ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ వరుసగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను (ఎంసీఎల్ఆర్‌) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్‌ రేటు 7.90గా ఉంది.. తాజా తగ్గింపుతో 7.85కు చేరినట్లు సమాచారం. ఈ సరికొత్త రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి.టర్మ్‌ డిపాజిట్లపై బ్యాంక్‌ చెల్లించే వడ్డీరేట్లను కూడా తగ్గించాలని నిర్ణయించింది. ఈ తగ్గింపు 10-50 బేసిస్‌ పాయింట్ల వరకు ఉంటుంది. ఇవి కూడా ఫిబ్రవరి 10 తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
*2019-20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ రూ.905.13 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన రూ.772.81 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 17.07 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.7,937.33 కోట్ల నుంచి రూ.7,074.86 కోట్లకు తగ్గింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 3250% (రూ.65) మధ్యంతర డివిడెండును కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
*విద్యుత్ బస్సులను ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్కు చెందిన ఒలెక్ట్రా-బీవైడీ దిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో2020లో నూతన మోడల్ను ప్రదర్శించింది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో మొదటి ఇంటర్ సిటీ బస్సు ఒలెక్ట్రా-బీవైడీ సీ9ను గురువారం ఆవిష్కరించారు. 45-49 సీట్ల సామర్థ్యంతో 12 మీటర్ల పొడువున్న ఈ బస్సు దూర ప్రయాణాలను లక్ష్యంగా తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ ఇది పరుగులు తీస్తుంది. పట్టణాల మధ్య ప్రయాణం చేసేవారికి అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని రూపొందించినట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్కే రావల్ తెలిపారు.
*ఐఐటీ హైదరాబాద్కి చెందిన అంకుర సంస్థ ‘ప్యూర్ఈవీ’ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 116 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలగడం దీని ప్రత్యేకత. ‘ఈ-ప్లూటో 7జీ’గా దీనికి నామకరణం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ ప్రాంగణం పక్కనే ఈ సంస్థ ఉత్పత్తి యూనిట్ను నెలకొల్పారు. నెలకు 2వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ నెల 9న నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ సతీష్రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్మూర్తి, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ చేతుల మీదుగా ఈ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
*అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.705.3 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. త్రైమాసిక ఆదాయం రూ.5,895 కోట్లు నమోదైంది. ఈపీఎస్ రూ.12.04 ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.5,269 కోట్లు, నికరలాభం రూ.712.2 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ప్రస్తుత మూడో త్రైమాసికంలో ఆదాయం 11.9 శాతం పెరిగితే, నికరలాభం 1 శాతం క్షీణించింది.
*తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఎఫ్టీసీసీఐ) 22 విభాగాల్లో వార్షిక ‘ఎక్స్లెన్సీ పురస్కారాలు-2019’ కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. గురువారం ఫెడరేషన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పురస్కారాల కమిటీ ప్రతినిధులు గౌరా శ్రీనివాస్, జస్టిస్ వి.భాస్కరరావు, సూరజ్ ప్రసాద్ అగర్వాల్, రమాకాంత్ ఇనాని, కె.భాస్కరరెడ్డి, వి.ఎస్.రాజులతో కలిసి కమిటీ ఛైర్మన్ రవీంద్రమోదీ పురస్కారాల నామినేషన్లకు సంబంధించిన కరదీపికను ఆవిష్కరించారు. మరిన్ని వివరాలకు కులకర్ణి (8008579625) నెంబరులో సంప్రదించాలని కోరారు.
*ఆన్లైన్లో ఆధార్ వివరాలు నమోదు చేస్తే, వెంటనే ఇ-పాన్ (ఆన్లైన్ శాశ్వత ఖాతా సంఖ్య) జారీ చేసే సేవలు ఈ నెలలోనే ప్రారంభిస్తామని రెవెన్యూ కార్యదర్శి అజయ్భూషణ్ పాండే తెలిపారు. ప్రస్తుతం పాన్ కావాలంటే, ప్రత్యేక దరఖాస్తును పూరించాల్సి ఉంది. 2020-21 బడ్జెట్లో ప్రతిపాదించిన ఇ-పాన్ కోసం దరఖాస్తునేమీ నింపాల్సిన అవసరం లేదు. ఆధార్ వివరాలతోనే, వెంటనే జారీ చేస్తారు. ఇందుకోసం వ్యవస్థ సిద్ధమవుతున్నందున, ఈ నెలలోనే అమలు ప్రారంభమవుతుందని పాండే చెప్పారు.