NRI-NRT

న్యూజెర్సీలో ఘంటసాల వర్థంతి

Ghantasala Death Anniversary Event In New Jersey By TANA 2020

తానా-GSKIల ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఘంటసాల వర్థంతిని నిర్వహించారు. ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుపాటను ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆయన చేసిన కృషిని మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధులు కసుకుర్తి రాజా, రామిశెట్టి సుమంత్, న్యూజెర్సీ పబ్లిక్ సర్వీస్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, సాయిదత్త పీఠం ఆచార్యులు రఘు శంకరమంచి, దాము గేదల, సుధాకర్ ఉప్పాల, శ్రీనివాస్ గూడూరి, శివ కనకమేడల, రేఖ ఉప్పులూరి, విజయ నాదెళ్ల, లక్ష్మి మోపర్తి, ప్రవీణ్‌ గూడూరు, ప్రవీణ్రెడ్డి, సాయి పాలేటి, రవి మాచర్ల, సుధీర్ నారెపలుపు తదితరులు పాల్గొని. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి, కార్యదర్శి పొట్లూరి రవి, అంతర్జాతీయ సమన్వయకర్త దేవినేని లక్ష్మీలకు ధన్యవాదాలు తెలిపారు.