ScienceAndTech

రేడియేషన్ థెరపీ అంటే ఎలా చేస్తారు?

What is radiation therapy and how is it done

*** ఎలా ఇస్తారు..?
వాయువులు మెషిన్‌ ద్వారా ట్రావెల్‌ చేస్తూ రేడియేషన్‌ను టార్గెటెడ్‌గా పంపిస్తాయి. అంటే క్యాన్సర్‌ కణజాలం పైకి మాత్రమే రేడియేషన్‌ వెళ్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి 4 ఫ్రాక్షన్లుగా ఇస్తారు. ఒక ఫ్రాక్షన్‌ను ఎక్కువ డోస్‌తో కూడా ఇస్తున్నారు. ఒకటిన్నర నెల పాటు ఈ రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫొటాన్ల కన్నా ప్రొటాన్‌ థెరపీ వల్ల సైడ్‌ ఎఫెక్టులు తక్కువ. అదేవిధంగా ఈ రెండింటి కన్నా హెచ్‌ఐటి ద్వారా సైడ్‌ ఎఫెక్టులు మరింత తక్కువ. ఫొటాన్‌ రేడియేషన్‌ పెద్ద ఎత్తులో మొదలై క్యాన్సర్‌ దగ్గరికి వెళ్లేసరికి మందగిస్తుంది. అందుకే దీనికి హై డోస్‌ ఇవ్వాలి. అందువల్ల నార్మల్‌ కణజాలం డ్యామేజ్‌ అవుతుంది. కాబట్టి సైడ్‌ ఎఫెక్టులు ఎక్కువ. కార్బన్‌ అయాన్‌ ట్యూమర్‌ దగ్గర మాత్రమే ఎక్కువ డోస్‌లో ఉండి తరువాత క్రమంగా తగ్గిపోతుంది. కార్బన్‌ అయాన్‌ లోపలికి ప్రవేశించిన తరువాత క్యాన్సర్‌ ట్యూమర్‌ దగ్గర మానిప్యులేట్‌ అవుతుంది. కాబట్టి నార్మల్‌ కణజాలం దెబ్బతినదు. ఇది క్యాన్సర్‌ కణాల డిఎన్‌ఎను డ్యామేజ్‌ చేసి కణాలు చనిపోయేలా చేస్తుంది. ఇలా డ్యామేజ్‌ అయిన డిఎన్‌ఎ అంత తొందరగా రిపేర్‌ కాదు. సెల్‌ డెత్‌ అవకాశం ఎక్కువ. నార్మల్‌ టిష్యూ డ్యామేజ్‌ ఉండదు కాబట్టి సైడ్‌ ఎఫెక్టులు దాదాపుగా ఉండవు. హెచ్‌ఐటి బయలాజికల్‌ ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యునోథెరపీ తరువాత కూడా దీన్ని ఇవ్వొచ్చు.

*** ఎవరికి?
సంప్రదాయిక రేడియోథెరపీ ఉపయోగించలేని పరిస్థితి ఉంటే ఇక ఏమీ చేయలేకపోయేవాళ్లం. కాని ఇప్పుడు సర్జరీ చేయలేనివి, ఇతర రేడియోథెరపీ పనిచేయని పరిస్థితుల్లో కూడా హెవీ అయాన్‌ థెరపీతో మంచి ఫలితాలను అందించవచ్చు. ఎముకకు వచ్చే సార్కోమాను నార్మల్‌ రేడియేషన్‌తో ట్రీట్‌ చేయడం కొంచెం కష్టం. ఇలా సంప్రదాయిక రేడియేషన్‌ ఇవ్వడం కష్టమైనా, సర్జరీ చేయలేని పరిస్థితి ఉన్నా హెచ్‌ఐటి మంచి ఫలితాలనిస్తుంది. ఉదాహరణకు రెక్టల్‌ ఏరియాలో వచ్చిన క్యాన్సర్‌కు ఆపరేషన్‌ చేయడం కష్టం. హెచ్‌ఐటి ద్వారా రేడియోథెరపీతో మంచి చికిత్స అందించవచ్చు. ఫొటాన్‌ రేడియేషన్‌ రెస్పాన్స్‌ తక్కువగా ఉంటే కూడా ఈ థెరపీ సరిపోతుంది. ఫొటాన్‌ థెరపీతో రెస్పాండ్‌ కాకుంటే మెలనోమా, హెడ్‌ అండ్‌ నెక్‌ లాంటివి అప్పుడు హెచ్‌ఐటి ఉపయోగిస్తారు. రికరెంట్‌ కేసుల్లో కూడా ఇవ్వొచ్చు. హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లు సాధారణంగా ఫొటాన్‌ రేడియేషన్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అంటే సులువుగా చికిత్స చేయొచ్చు. ముఖ్యంగా హెడ్‌ అండ్‌ నెక్‌ ఏరియాలో వచ్చే స్కామస్‌ కార్సినోమా ఫొటాన్‌కు సెన్సిటివ్‌గా ఉంటుంది. అంటే ఈ రేడియేషన్‌తో ఆ క్యాన్సర్‌ని సులువుగా నిర్మూలించవచ్చు. మాలిగ్నెంట్‌ మెలనోమా, గ్రంథుల నుంచి పుట్టే అడినాయిడ్‌ సిస్టిక్‌ కార్సినోమాలకు హెచ్‌ఐటి మంచిది. వీటికి సాధారణంగా సర్జరీ చేస్తారు. కాని కొన్నిసార్లు సర్జరీ చేయలేము. హెడ్‌ అండ్‌ నెక్‌ ఏరియాలో వచ్చి, ఏ కన్ను వరకో వెళ్తే సర్జరీ చేయలేం. ఇలాంటప్పుడు కార్బన్‌ అయాన్‌ ట్రీట్‌మెంట్‌ బాగా ఉపయోగపడుతుంది. అడినాయిడ్‌ సిస్టిక్‌ కార్సినోమాకు ఫొటాన్‌ రేడియేషన్‌ కూడా ఇవ్వడం కష్టం. ఇది దానికి రెసిస్టెంట్‌గా ఉంటుంది. లివర్‌ క్యాన్సర్‌ కణితి పెద్దగా ఉంటే ఫొటాన్‌ రేడియేషన్‌తో రెస్పాండ్‌ కాదు. కొన్నిసార్లు ఆపరేషన్‌ కూడా కష్టం అవుతుంది. ఇలాంటప్పుడు నాలుగు సిట్టింగ్స్‌లో ఇచ్చే కార్బన్‌ అయాన్‌ ట్రీట్‌మెంట్‌ మేలు చేస్తుంది. ఇది నాలుగో దశలో ఉన్న క్యాన్సర్‌కు కూడా పనికొస్తుంది.

*** ఎక్కడెక్కడ?
జపాన్‌తో పాటుగా చైనా, జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో ఈ ట్రీట్‌మెంట్‌ ఉంది. అమెరికాలో కూడా లేదు. 1995 నుంచి జపాన్‌ ఈ ట్రీట్‌మెంట్‌ వాడుతోంది. ఏ సాలిడ్‌ ట్యూమర్‌కైనా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది 1 శాతం పేషెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 13 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. హెవీ అయాన్‌ థెరపీని కార్బన్‌ అయాన్‌తో పాటు, ఇమ్యునోథెరపీని కలిపి ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. ఒక గ్రూప్‌కి కేవలం కార్బన్‌ అయాన్‌, మరొక గ్రూప్‌కి కార్బన్‌ అయాన్‌తో పాటు ఇమ్యునోథెరపీ ఇచ్చి చూశారు. పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.