Sports

దిక్కుమాలిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం

Bangaldesh Cricket Captain Mortaza Responds To Journallist's Stupid Question

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌ మష్రఫె మోర్తాజా ఈ రోజు నుంచి జింబాబ్వేతో తలపడే మూడు వన్డేల సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అతడు సహనాన్ని కోల్పోయి ఓ విలేకరిపై మండిపడ్డాడు. మోర్తాజా గత ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే వికెట్‌ తీశాడు. ‘ఇటీవల మీరు ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నందుకు సిగ్గుపడుతున్నారా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. చిర్రెత్తుకొచ్చిన బంగ్లా కెప్టెన్‌ ‘నేనెందుకు సిగ్గుపడాలి? నేనేమైనా దొంగనా?’ అని ఘాటుగా స్పందించాడు.