Movies

కమిలిని కవిత్వాలు

The poetry of kamilini mukherjee

గోదారి… వయారాల్తో ఆకట్టుకునే జలసిరి. వెన్నెట్లో అందాలు ఆరబోస్తూ…అడపాదడపా కన్నెర్ర చేసే వరదపొంగై వెల్లువెత్తుతూ… తను నడిచినంతమేరా పుడమి తల్లికి ఆకుపచ్చని చీరని బహూకరిస్తూ…సొగసుసోయగాలతో వెల్లివిరిసే గోదారిని ఆవిష్కరించడం మాటల్లో సాధ్యమా? ఎక్కడో … ఏ కొండ కోణాల్లో కోనల్లో ఓ చిన్ని బిందువై పుట్టి…ప్రాంతాలు, భాషలు, రాష్ట్రాల సరిహద్దుల్ని సైతం అధిగమించిన నదిలాంటిదే నటి జీవనం కూడా. కళాకారిణికి భాషాభేదాలు, ప్రాంతాల వైషమ్యాలుండవు. విభిన్న సంస్కృతులను కలిపే ఐక్యతాసూత్రం సృజనశీలురకు అందివచ్చిన వరం. గోదారి నీటితో తెలుగు తెరను తడిపేసి… గోదారి ఒడ్డున గోపికలా అభినయ కౌశలంతో విఖ్యాతి పొందిన తారక ఆమె. పేరు కమలిని ముఖర్జీ. ఈ అందాల ‘గోపిక’ పుట్టినరోజు మార్చి 4. కమలిని ముఖర్జీ (అసలు పేరు: రోష్ని లేక రోని) మార్చి 4, 1980 లో కలకత్తాలో జన్మించింది. ఇద్దరు చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్ లో నాటక ప్రదర్శనల తర్వాత ముంబాయి పట్టణంలో నాటకాల పై నిర్వహించిన అభ్యాస సదస్సులో పాల్గొన్నది. నాటకాలే కాకుండా, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, చిత్రలేఖనం కమలినికి ప్రీతిపాత్రమైనవి. పెక్కు సంవత్సరాలు భరత నాట్యం అభ్యాసం చేసింది. నీల్‌కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాచూట్ కోబ్బరి నూనె, ఫైర్ అండ్ లవ్లీ క్రీం ఇంకా ఆయుష్ వ్యాపార ఉత్పత్తుల ప్రకటన చిత్రాలలో నటించింది.కమలినిని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) హిందీ చిత్రంలో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కథా నేపథ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలినికు కవిత్వం రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, వాషింగ్టన్ లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సుకు ఆహ్వానించిన 150 మందిలో కమలిని ఉంది. అదే సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాలో కథానాయిక అవకాశం రావటంతో సినిమా వైపే మొగ్గు చూపింది