DailyDose

నెల్లూరు కొరోనా పరీక్ష పాజిటివ్-తాజావార్తలు

Corona Test Comes Out Positive In Nellore-Telugu Breaking News Roundup Today

* పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యక్తికి కొవిడ్‌-19 (కరోనా) వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ధ్రువీకరించారు. బుధవారం కరోనా అనుమానిత లక్షణాలతో ఓ యువకుడు జీజీహెచ్‌లో చేరిన విషయం తెలిసిందే. యువకుడు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడు. అతని నమూనాలను మొదట తిరుపతి స్విమ్స్‌లో పరీక్షించి కరోనా సోకినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం పూర్తిస్థాయి పరీక్షల కోసం నమూనాలను పుణె పంపగా అక్కడ పాజిటివ్‌గా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాధితుడిని నెల్లూరు జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా బాధితుడి కుటుంబసభ్యుల నమూనాలను పరీక్షించగా నెగటివ్‌ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

* కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. దిల్లీలోని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను సోనియాకు వివరించినట్లు చెప్పారు. స్థానిక ఎన్నికల సమయంలో తెరాస చేసిన అక్రమాలను తెలిపానన్నారు. పీసీసీ అధ్యక్షుడిని త్వరగా నియమించాలని సోనియాను కోరినట్లు కోమటిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అందర్నీ కలుపుకొని వెళ్లే వ్యక్తికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలని.. పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు.

* రాష్ట్రంలో వైకాపా రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చిందని.. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అభ్యర్థులు తట్టుకుని బలంగా నిలబడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి భాజపా-జనసేన ఉమ్మడిగా రూపొందించిన ‘విజన్‌ డాక్యుమెంట్‌’ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. తొలుత పవన్‌ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలనే భాజపా-జనసేన కలిసి పోటీ చేస్తు్న్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల నామినేషన్లు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులు నామినేషన్లు వేయలేని విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు అనగానే ప్రజలు భయానికి గురయ్యే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దౌర్జన్యాలకు పాల్పడితే ఎన్నికలు నిర్వహించడం ఎందుకని పవన్‌ ప్రశ్నించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పవన్‌ చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కఠినంగా వ్యవహరించినట్లయితే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భయపెట్టి సాధించిన గెలుపు ఎన్నటికీ నిలబడదని పవన్‌ వ్యాఖ్యానించారు.

* తెదేపా సీనియర్‌ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి (బలరాం) వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో బలరాంతో పాటు ఆయన కుమారుడు వెంకటేశ్‌ వైకాపాలో చేరనున్నారు. ఈవిషయాన్ని కరణం బలరాం స్వయంగా ప్రకటించారు.

* రాష్ట్రంలో వైకాపా రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చిందని.. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అభ్యర్థులు తట్టుకుని బలంగా నిలబడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి భాజపా-జనసేన ఉమ్మడిగా రూపొందించిన ‘విజన్‌ డాక్యుమెంట్‌’ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. తొలుత పవన్‌ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలనే భాజపా-జనసేన కలిసి పోటీ చేస్తు్న్నాయని స్పష్టం చేశారు.

* సీఎం కేసీఆర్ సూచనల మేరకు మానవీయ కోణంలో అద్భుతమైన బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆర్థిక మాంద్యం వల్ల ఎన్నికల హామీలను తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని కాంగ్రెస్‌ ఆశపడిందన్నారు. ప్రజలందరినీ సంతోషపెట్టే విధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టామని.. కాంగ్రెస్‌ నాయకులకు ఉన్న భ్రమలను బడ్జెట్‌ బద్దలు కొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు వైకాపా ప్రజా ప్రతినిధుల కుమారులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో అధికార వైకాపాకు చెందిన ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబ సభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూదని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. అయినా పార్టీ ఆదేశాలను ధిక్కరించి పలువురు నేతల వారసులు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి జడ్పీటీసీ స్థానానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కుమారుడు కృష్ణ చైతన్య, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు రెడ్డి శ్రావణ్‌ హిరమండలం జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

* సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలనపై విసుగుతో ప్రజలు భాజపాకు అవకాశం ఇచ్చారని చెప్పారు. లేకలేక వచ్చిన అవకాశాన్ని భాజపా తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేంద్రం వసూలు చేసే కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చమెత్తుకునేది కాదని.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలకు ఆ వాటా ఇవ్వాల్సిందేనని కేసీఆర్‌ అన్నారు.

* మధ్యప్రదేశ్‌లో సంక్షోభం ఎదుర్కొంటున్న కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ఈ నెల 16న బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు భాజపా సీనియర్‌ నేత, ఆ పార్టీ చీఫ్‌ విప్‌ నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. జ్యోతిరాధిత్య సింధియాతో పాటు ఆయన మద్దతుదారులైన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కమల్‌నాథ్‌ సర్కారు ప్రమాదంలో పడింది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన నేపథ్యంలో ఈ నెల 16న బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు నరోత్తమ్‌ తెలిపారు. అదే రోజు నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

* కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన వేళ వ్యాధి చికిత్సకు సంబంధించి కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ( ఐఆర్‌డీఏ) కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఎలాంటి బీమాను కలిగి ఉన్నా కరోనా వైరస్‌కు చికిత్సను కూడా అందులో చేర్చాలని అన్ని ఆరోగ్య బీమా సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 4న సర్క్యులర్‌ జారీ చేసిన ఐఆర్‌డీఏ.. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులకు తక్షణమే వైద్య బీమా వర్తింపజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

* ప్రపంచం మొత్తం కరోనావైరస్‌ (కొవిడ్‌-1) భయంతో కకావికలమవుతోంది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది. అయితే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఓ 37 ఏళ్ల అమెరికన్‌ మహిళ, కరోనా భయంతో వణికిపోతున్న వారికి ఊరట కలిగించేందుకు తన అనుభవాలను వివరించారు. బయోఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న ఎలిజబెత్‌ ష్నెయిడర్‌, వాషింగ్టన్‌ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన సియాటెల్‌కు చెందినవారు. అమెరికాలో అతి ఎక్కువ కరోనా మరణాలు ఈ నగరంలోనే నమోదు కావటం గమనార్హం.

* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌పై అనుమానాలు మరింత ముదురుతున్నాయి. అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించకుండా లీగ్‌ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రభావం పెరగడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బీసీసీఐ సహా జాతీయ క్రీడా సమాఖ్యలకు (ఎన్‌ఎస్‌ఎఫ్‌) పలు సూచనలు చేసింది. ఏప్రిల్‌ 15 వరకు స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం విదేశీ ఆటగాళ్ల వీసాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

* స్టాక్‌ మార్కెట్లను కరోనా భయాలు కుదిపేశాయి. పతనాల్లో కొత్త రికార్డులను సృష్టించాయి. సూచీలన్నీ పతనానికి పర్యాయ పదంలా మారాయి. ఆరంభం నుంచి ముగిసే వరకూ నష్టపోవడం మాత్రమే తెలుసున్న రీతిలో షేర్లు కదలాడాయి. మార్కెట్‌ ఎప్పుడు అయిపోతుందా? అని ప్రతి మదుపరి బహుశా ఆశగా ఎదురు చూసి ఉంటాడేమో. ఆ స్థాయిలో సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అలా చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2,919 పాయింట్ల నష్టంతో 32,778కు పడిపోయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 868.25 పాయింట్ల నష్టంతో 10వేల మార్కును దిగి, 9,590 వద్ద స్థిరపడింది.