Business

₹42వేలకు బంగారం

Gold Price Comes Down To 42000 Rupees

బంగారం ధర భారీగా తగ్గింది. మదుపరులు పెట్టుబడులు మళ్లించడం, రూపాయి బలపడటంతో దిల్లీలో మేలిమి బంగారం (24 క్యారెట్స్‌) ధర రూ.1097 తగ్గి రూ.42,600కు చేరింది. గత సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.43,697గా నమోదైంది. వెండి సైతం కేజీ రూ.1574 తగ్గి, 44,130కి చేరుకుంది.దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత మళ్లీ పుంజుకుంది. దీనికి తోడు ద్రవ్య లభ్యత విషయంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం రూపాయికి కలిసొచ్చింది. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసలు కోలుకుంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,584 డాలర్లు ఉండగా .. వెండి ధర 15.65 డాలర్లు ఉంది.