Movies

భూమి సెలవులు ఆస్వాదించండి

Nivetha Peturaj latest corona virus news-telugu movie news

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. మరో వైపు సినీ ప్రముఖులు తమవంతుగా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. బయటకు వెళ్లినా సామాజిక దూరం తప్పకుండా పాటించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా నటి నివేదా పెతురాజ్‌ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో.. ‘మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అందరం ఐక్యంగా ఉందాం. మిమ్మల్ని నమ్ముకున్న వారిని కాపాడుకోండి. ఎన్నో సంవత్సరాలు పరుగులు పడుతూనే ఉన్నారు. కానీ ఈ భూమి మీకు ప్రస్తుతం విశ్రాంతి ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఇంట్లోనే ఉండండి’ అని పేర్కొన్నారు.