Health

తెలంగాణాలో బానే కోలుకున్న కొరోనా రోగులు

11 Corona Positive Patients Recover Successfully

తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తూ వైరస్‌ను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైరస్‌ సోకిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో 11 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. వీరందరికీ గతంలో పాజిటివ్‌ అని తేలగా.. తాజా నమూనాల్లో నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు. ఇటీవల వీరందరికీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించారు.