Politics

20న గచ్చిబౌలి ఆసుపత్రి ప్రారంభం

Etela Announces Gachibowli Hospital Opens On April 20

కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలి ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి తీర్చిదిద్దినట్టు తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ నెల 20న ఈ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘10లక్షల పీపీఈ కిట్లు, 10లక్షల ఎన్‌95 మాస్కులు, ఆస్పత్రుల్లో గాగుల్స్‌, వైద్య పరికరాలు సమకూర్చుకుంటున్నాం. వైద్య సిబ్బందితో పాటు రక్షణ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేస్తున్నాం’’ అని వివరించారు.