Movies

కటింగ్ నిధి

Nidhi Agarwal Becomes A Barber-Telugu Movie News

‘కూటి కోసం కోటి విద్యలు’ అని ఓ సామెత. కరోనా తర్వాత దాన్ని కాస్త మార్చి చెప్పాలేమో? ‘కాలక్షేపం కోసం కోటి విద్యలు’ అని! లాక్‌డౌన్‌ వల్ల ఇంటి గోడల మధ్య మాత్రమే తిరుగుతున్న కథానాయికలు తమలో సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. కొత్త కళలు నేర్చుకుంటున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌ అయితే కత్తెర చేతబట్టి సిస్టర్‌కి హెయిర్‌ కటింగ్‌ చేశారు. ‘కటింగ్‌ అమ్మా… హెయిర్‌ కటింగ్‌’ అంటూ తనలో కొత్త కళను బయటకు తీశారు. సిస్టర్‌కి హెయిర్‌ కట్‌ చేసిన తర్వాత ‘నేను హెయిర్‌ స్టయిలిస్ట్‌ కూడా కావచ్చు’ అని నిధి అగర్వాల్‌ స్వీయ ప్రశంస ఇచ్చుకున్నారు. ‘నెక్ట్స్‌ కస్టమర్‌ మా నాన్నే’ అంటూ ఆమె చమత్కరించారు! ఖాళీ సమయాల్లో సినిమాలు, వెబ్‌ సిసలు చూస్తున్న ఈ భామ, ఆన్‌లైన్‌లో ఫిల్మ్‌ కోర్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.