ScienceAndTech

మందుబిళ్లలు దాచుకుని…

The cunning fox behavior of China in tackling COVID19

కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రతను ప్రపంచానికి తెలియజేడంలో చైనా కావాలనే నిర్లక్ష్యం వహించిందని అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చైనా అలా ఎందుకు దాచిపెట్టాలని చూసిందో కూడా చెప్పుకొచ్చింది. వైరస్‌ను ఎదుర్కోవడానికి కావాల్సిన ఔషధాల్ని నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతోనే డ్రాగన్‌ దేశం బయటి ప్రపంచంతో దాని తీవ్రతను పంచుకోలేదని ఆరోపించింది. ఈ మేరకు అమెరికా హోంలాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ఓ నివేదికలో పేర్కొన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. ఓవైపు తీవ్రతను తక్కవ చేసి చూపుతూనే.. మరోవైపు చైనా దిగుమతుల్ని పెంచుకుందని, ఎగుమతుల్ని తగ్గించిందని నివేదికలో ఆరోపించింది. పైగా ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతూ..అస్పష్టమైన వాణిజ్య వివరాలతో దాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించిందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఔషధాల్ని దిగుమతి చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు సైతం ఇది అంటువ్యాధి అన్న విషయం చైనా తెలియజేయలేదంది. ఈ క్రమంలోనే మాస్కులు, సర్జికల్‌ గౌన్లను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుందని తెలిపింది. చైనా ఎగుమతి, దిగుమతుల్లో వ్యత్యాసాలు అసాధారణంగా ఉన్నాయని.. దీన్ని బట్టే అసలు అంశాన్ని చైనా దాచిందన్న విషయం స్పష్టమవుతోందన్నారు.