Kids

బడి బందు…గుడి బందు…

How liquor is impacting the lock down results-A poem

బడి బందు.. గుడి బందు..
అయినా
నువ్విస్తున్న మందే ముందు

జిమ్ము బందు … స్విమ్ము బందు..
అయినా
నువ్విస్తున్న రమ్మ్మే ముందు

వేలల్లో పెళ్లిళ్ళు బందు..
రేయిల్లో గల్లీలు బందు..
అయినా
కైపుల్లో నువ్వేసే చిందులే ముందు

హోటల్ బందు .. టోటల్ బందు..
అయినా
నువ్విస్తున్న బాటిలే ముందు

‘బారు’ల ముందు.. బీరుల ముందు..
కిక్కెక్కిన వీరులే ముందు..

సాగుతున్న లాక్డౌన్ ముందు..
పారుతున్న గోడౌనే ముందు

బతికేసే జట్కా ముందు..
చిదిమేసే గుట్కానే ముందు

ఊడ్చేసిన రోడ్ల ముందు..
ఉమ్మేసే పొగాకే ముందు..
దమ్మ్మేసే పొగరాయుల్లే ముందు

కరుడు గట్టిన కరోనా ముందు..
నరుడు కొనితెచ్చుకుంటున్న ఈ మరణమే ముందు