Movies

ప్రేమ గుట్టు విప్పిన తాప్సీ

Tapsee Pannu Reveals Her Sports Boy Friend Details

తాను ఎవరినైనా ప్రేమిస్తే అతడి గురించి తొలుత అమ్మనాన్నలకు చెబుతానంటోంది తాప్సీ. కుటుంబసభ్యులు అంగీకరిస్తేనే ఆ బంధాన్ని కొనసాగిస్తానని చెప్పింది. కెరీర్‌, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ఏ విషయాన్ని రహస్యంగా దాచడం తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మాథీస్‌ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ప్రేమాయణానికి తాప్సీ కుటుంబసభ్యులు ఓకే చెప్పినట్లు సమాచారం. తాప్సీ మాట్లాడుతూ ‘నా జీవితంలో ఎవరైనా ఉంటే అతడెవరో గర్వంగా చెబుతాను. అలాగని ఆ బంధం పతాకశీర్షికలకెక్కాలని కోరుకోను. నటిగా ఎన్నో ఏళ్లు శ్రమించి నేను సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులు ప్రేమవ్యవహారం వల్ల దూరం కాకూడదు. నేను ఎవరితోనైనా ప్రేమలో ఉంటే అతడిని కుటుంబానికి పరిచయం చేస్తాను. నేను ప్రేమించే వ్యక్తి మా అమ్మనాన్నలతో పాటు నా సోదరికి కూడా నచ్చాలి. ఒకవేళ మా ప్రేమను కుటుంబం అంగీకరించకపోతే ఆ బంధాన్ని కొనసాగించడం కష్ట మే’ అం టూ తెలిపింది.