DailyDose

2715 మంది డిశ్చార్జ్-TNI కరోనా బులెటిన్

2715 Corona Affected Discharged In India-TNILIVE Corona Bulletin

* సిపిఎం నేత సిహెచ్ బాబూరావు విజయవాడలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

* తిరుపతి తుమ్మలగుంట లో రెడ్ జోన్ ఉన్న అపార్ట్మెంట్ వద్ద స్థానికులకు సూచనలిస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి., జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త తదితరులు.

* దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల పరిస్థితి ఏంటంటే…

* హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ రోజు కొత్తగా ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85కి పెరిగింది. ఇందులో 37 మంది చికిత్స పొందుతుండగా, ముగ్గురు చనిపోయారు. 41 మంది నయమై డిశ్చార్జి అయ్యారు.

* పంజాబ్‌లో కరోనా కేసుల సంఖ్య 1,980కి చేరింది. ఈ రోజు కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. ఇందులో 297 యాక్టివ్‌ కేసులు కాగా, 37 మంది చనిపోయారు. 1,547 మంది డిశ్చార్జి అయ్యారు.

* దిల్లీలో ఈ రోజు 160 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,054కి చేరింది. ఇందులో 4,485 మంది నయమై డిశ్చార్జి అయ్యారు.

* కేరళలో మొత్తం కేసుల సంఖ్య 630కి పెరిగింది. ఈ రోజు కొత్తగా 29 కేసులను గుర్తించారు. ఇందులో 130 యాక్టివ్‌ కేసులు. 29 కేసుల్లో 21 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు.

* కర్ణాటకలో ఈ రోజు 99 కొత్త కేసులను గుర్తించారు. ఈ రోజు సాయంత్రం ఐదు వరకు అందిన సమాచారం చూస్తే… రాష్ట్రంలో 678 యాక్టవ్‌ కేసులున్నాయి. 37 మంది చనిపోగా, 530 మంది నయమై డిశ్చార్జి అయ్యారు.

* ఝార్ఖండ్‌లో ఈ రోజు రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 225కి పెరిగింది.

* ఉత్తరాఖండ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96గా ఉంది. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మూడు కేసులు నమోదయ్యాయి.

* దేశంలో గత 24 గంటల్లో 2,715 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారని కేంద్రం ప్రకటించింది. దీంతో మన దేశంలో కరోనా రికవరీ రేటు 38.29 శాతంగా ఉందని తెలిపింది. మన దేశంలో లక్షలో 7.1 మందికి కరోనా సోకుతోందని కేంద్రం తెలిపింది.

* దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 96169. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 56316

* ఏపీలో కరోనాకు అడ్డుకట్ట పడడం లేదు. పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,713 శాంపిళ్లను పరీక్షించగా మరో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 94 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,282 ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 705 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,527 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 15, తూర్పుగోదావరిలో 5, కడపలో 2, కృష్ణాలో 15, కర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖపట్నంలో 1, విజయ నగరంలో 1, పశ్చిమ గోదావరిలో 2 నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కర్నూలులో మొత్తం కేసులు 615కు చేరాయి.

* కృష్ణ జిల్లా లో 15
చిత్తూరులో 15
ఈస్ట్ గోదావరి లో 5
కర్నూలులో 4
నెల్లూరు లో 7
కడప లో 2
విశాఖపట్నం లో 2
విజయనగరం లో 1 కేసు నమోదు అయ్యాయి

అనంతపురం, గుంటూరు,ప్రకాశం,శ్రీకాకుళం నమోదు కాని కేసులు