Movies

కోరిక తీరలేదు

Nidhi Agarwal's Unquenched Wishes

తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకుంటోంది నిధి అగ‌ర్వాల్. ఈ బ్యూటీ లాక్‌డౌన్ స‌మ‌యంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌పై ప‌ట్టు సాధించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈమెకు చారిత్రాత్మ‌క చిత్రాల్లో న‌టించాల‌నే కోరిక ఉన్న‌ట్లు రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ‘‘నాకు యాక్షన్ సినిమాలోనూ నటించాలని ఉంది. తొలి సినిమాను టైగ‌ర్ ష్రాఫ్‌తో క‌లిసి న‌టించాను. ఆ స‌మ‌యంలో మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. వాటిని ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఇంత వ‌ర‌కు రాలేదు. అలాంటి అవకాశం ఉన్న పాత్ర వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను’’ అని మ‌న‌సులో కోరిక‌ను బ‌య‌ట పెట్టింది నిధి అగ‌ర్వాల్‌. మ‌రి ఈ అమ్మ‌డు కోరిక ఎప్పుడు తీరేనో.