Editorials

నాగాల్యాండ్…కరోనా కేసులు నిల్

How one Indian state managed to block corona entirely with 0 cases

దేశం మొత్తం కరోనాతో అల్లాడిపోతున్నా ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ మాత్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడానికి ఆ రాష్ట్రం తీసుకుంటున్న అద్భుతమైన కట్టడి చర్యలే కారణం. దేశంలో కేసులు వెలుగు చూసిన వెంటనే నాగాలాండ్ అప్రమత్తమైంది. అసోంతో సరిహద్దులు మూసేసింది. అలాగే, ఇతర రాష్ట్రాలో చిక్కుకున్న నాగాలాండ్ వాసులు తిరిగి రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు నగదు ప్రోత్సాహకాలు అందించింది. రాష్ట్రానికి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్న 19,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలమవుతున్నా నాగాలాండ్‌లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో గత వారం వరకు కోవిడ్ టెస్టింగ్ సెంటర్ లేకపోవడం. నాగాలాండ్‌తోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో కూడా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.