ScienceAndTech

వూహాన్ ప్రయోగశాలలో మరో మూడు రకాల కరోనా వైరస్ జాతులు

We have three strains of bat corona virus strains says wuhan virology lab director

చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా పురుడుపోసుకున్న కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ను వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే జన్యుపరంగా తయారుచేశారని అమెరికా సహ పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ల్యాబ్‌లో మూడు జాతులకు చెందిన గబ్బిలాల కరోనావైరస్ ఉంది..కానీ, ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి గురిచేస్తున్న సార్స్-కోవి2తో ఏదీ సరిపోలడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.50 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్.. తొలిసారి గబ్బిలాల నుంచి ఇతర క్షీరదాల ద్వారా మనుషులకు సంక్రమించినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వాంగ్ యాన్‌యీ మే 13 ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచే వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది అభూతకల్పన మాత్రమే అని పేర్కొన్నారు. గబ్బిలాల నుంచి కరోనా వైరస్ వేరుచేసి సేకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద మూడు జాతుల కరోనా వైరస్‌లు కలిగి ఉన్నామని, కానీ, SARS-CoV-2తో పోల్చిచూస్తే అత్యధికంగా సారూప్యత 79.8 శాతానికి మాత్రమే చేరుకుందని ఆమె తెలిపారు.