Devotional

తితిదే పాలకమండలి నిర్ణయాలు

TTD Board Appoints New Committee For Managing Assets

టిటిడి పాలకమండలి నిర్ణయాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు, కానుకలు, విక్రయించకూడదని నిర్ణయం తీసుకున్న టిటిడి పాలకమండలి….టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

నిరుపయోగంగా ఉన్న టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు కమిటీని నియమిస్తున్నాం…

కమిటీలో పీఠాధిపతులు, భక్తులకు సభ్యులుగా ఉంటారు..

గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను మా పాలకమండలి పై రుద్దుతూ బురదజల్లిన వారిపై సమగ్రవిచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకునెందుకు ప్రభుత్వాన్నీ కోరాలని నిర్ణయం తీసుకున్నాం…

తిరుమల లో అతిధి గృహం కేటాయింపుల్లో పారదర్శకత ఉంటుంది…పాత అతిధి గృహాలు పునర్నిర్మించేందుకు మాత్రమే అనుమతిస్తాం….

డోనేషన్ విధానంలో నూతన విధానాన్ని రూపొందించాలని టిటిడి ఈఓ ని కోరుతున్నాం…

టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో చిన్న పిల్లలు ఆసుపత్రిని నిర్మిస్తాం..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ముగిసిన అనంతరం శ్రీవారి దర్శనాల విషయం పై నిర్ణయం తీసుకుంటాం….చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..