ScienceAndTech

మరో రికార్డు బద్ధలుకొట్టిన యాపిల్

మరో రికార్డు బద్ధలుకొట్టిన యాపిల్

అమెరికన్‌ సాంకేతిక దిగ్గజం యాపిల్‌ మరో ఘనతను సాధించింది. 1.5 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించి తన సత్తా ఏంటో చూపింది. బలమైన యాప్‌ స్టోర్‌ విక్రయాలు, ల్యాప్‌టాప్‌‌, 5జీ ఫోన్ తదితర అమ్మకాలు యాపిల్ స్టాక్‌ విలువ పెరిగేందుకు దోహద పడ్డాయని నిపుణులు విశ్లేషించారు. ప్రస్తుతం ఒక్కోటీ ‌352 డాలర్ల విలువ గల 4.3 బిలియన్‌ షేర్లు ఉన్న యాపిల్‌ సంస్థ మార్కెట్‌ విలువ లక్షన్నర కోట్ల డాలర్ల పైమాటే అని నిపుణులు భావిస్తున్నారు. ఇదే ఊపులో కొనసాగితే రెండు ట్రిలియన్‌ డాలర్ల మార్కును చేరుకున్న ఘనత కూడా యాపిల్‌ స్వంతం కావచ్చని అంచనా వేస్తున్నారు. యాపిల్‌ షేర్ విలువ 550 డాలర్లను చేరుకున్నప్పుడు కంపెనీ మార్కెట్‌ విలువ రెండు ట్రిలియన్‌ డాలర్లు కాగలదని ఓ అంచనా. కాగా, 2018లో ఒక ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన తొలి అమెరికన్‌ సంస్థ కూడా యాపిల్‌ కావటం గమనార్హం.