DailyDose

పూణెలో ₹87కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం-నేరవార్తలు

* టీ నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామం లో నాటు సారా తయారీ కి నిల్వ ఉంచిన 1800 లీటర్ల బెల్లపు ఊటను 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శీ మరియు సిబ్బంది.

* కృష్ణా జిల్లా ÷ కంచికచర్ల (మం) పాత కక్షల నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మహిళ తో సహా నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

* అప్పుల బాధను తట్టుకోలేక ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ‘బతకాలని ఉంది, వ్యవసాయాన్ని నమ్ముకుని అప్పులపాలయ్యా. తాగుబోతును, తిరుగుబోతును కాదు. సాగు కోసమే అప్పు చేశా’ అంటూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని… రైతులు, కౌలు రైతుల మాటలు తాడేపల్లిలోని రాజప్రాసాదానికి వినపడుతున్నాయా చెప్పండి జగన్ గారూ? అని ఆయన ప్రశ్నించారు.

* మలికిపురం మండలం తూర్పు పాలెం,కరవాక,కేశనపల్లి తదితర సముద్ర తీర ప్రాంతాలలో ఓణ్ఘ్ఛ్ పైపుల నుంచి అక్రమంగా ఆయిల్ దొంగిలిస్తున్నారనే సమాచారంతో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ సూచనలు మేరకు అమలాపురం డిఎస్పీ షేక్ మాసుమ్ బాషా ఆధ్వర్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేయగా ఈరోజు తెల్లవారుజామున వచ్చిన సమాచారం మేరకు తూర్పుపాలెం బీచ్ రోడ్డులో ఓఎన్జీసీ వెల్ వద్ద నలుగురు వ్యక్తులు ఆయిల్ దొంగతనం చేస్తుండగా రాజోలు సిఐ దుర్గా శేఖర్ రెడ్డి సమక్షంలో మలికిపురం ఎస్సై నాగరాజు ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పదిహేను ఆయిల్ టిన్నులు, 170 లీటర్ల ఆయిల్ మరియు మహేంద్ర బొలెరో కారు స్వాధీనం చేసుకున్నారు.ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న రాజోలు సిఐ దుర్గా శేఖర్ రెడ్డి, మలికిపురం ఎస్సై నాగరాజు మరియు సిబ్బంది ని జిల్లా ఎస్పీ నయీం అస్మీ, అమలాపురం డిఎస్పీ షేక్ మాసుమ్ బాషా అభినందించారు.

* బహిరంగ ప్రదేశంలో ఉమ్మిన విషయమై ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళితే సెంట్రల్‌ దిల్లీలో అంకిత్‌(26), ప్రవీణ్‌ అనే వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రగాయాల పాలైన అంకిత్‌ మరణించాడు. ఇందుకు కారణం బహిరంగ ప్రదేశంలో పదే పదే ఉమ్మి వేస్తున్న ప్రవీణ్‌ను అంకిత్‌ వారించడమే. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ మొదలై పరస్పరం భౌతిక దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించి బుధవారం రాత్రి 8:30 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం రావడంతో ఘటనా ప్రదేశానికి వెళ్లగా, అప్పటికే ఇద్దరు వ్యక్తులు రక్తపుమడుగులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ప్రవీణ్‌కు ఎడమచేతికి, నడుంపైన గాయాలు కాగా, అంకిత్‌కు ఛాతీపై, భుజానికి తీవ్రగాయలయ్యాయని వారు తెలిపారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అంకిత్‌ అప్పటికే చాలా రక్తం కోల్పోవడంతో కొద్దిసేపటికే కన్నుమూశాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ కోలుకున్న వెంటనే అదుపులోకి తీసుకుని అతనిపై హత్యకేసు నమోదు చేసి విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు. కొవిడ్‌-19 వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న వేళ, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయటం, గుట్కా నమలడం వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే జరిమానాతో పాటు శిక్షలు కూడా విధించేలా చట్టాలను సవరణ చేశారు.

* పుణెలోని ఎరవాడసంజయ్‌ పార్క్‌ వద్ద అంతర్జాతీయ నకిలీనోట్ల రాకెట్‌ గుట్టును పుణె పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న నకిలీనోట్ల మొత్తం విలువ రూ.87కోట్లుగా తేలింది. పుణె విమానాశ్రయానికి సమీపంలోని ఓ బంగ్లాలో పెద్ద సంఖ్యలో నకిలీనోట్లు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

* నగరంలోని బెంజిసర్కిల్‌ సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రిలయన్స్‌ దుకాణాల సముదాయంలోని మొదటి అంతస్తులో ఉన్న రిలయన్స్‌ ఫుట్‌ ప్రింట్‌లో మంటలు చెలరేగాయి. ఆ సముదాయంలో వస్త్ర దుకాణం, కార్పొరేట్‌ కార్యాలయంతోపాటు ఇతర కార్యాలయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయిదు అగ్నిమాపక శకటాలతో రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో సుమారు 60 శాతానికిపైగా పాదరక్షలు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. విద్యుదాఘాతమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.