Movies

మాస్‌లో క్రేజ్ ఉన్న నటుడు…గోపీచంద్

మాస్‌లో క్రేజ్ ఉన్న నటుడు…గోపీచంద్

గోపీచంద్‌.. తెలుగులో ప్రస్తుతం మంచి మాస్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయకుల్లో గోపీచంద్‌ ఒకరు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడైన గోపీచంద్‌ ‘తొలివలపు’ చిత్రంతో తెరప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి విజయాల్ని అందుకొన్నారు. ‘యజ్ఞం’, ‘రణం’ చిత్రాలతో మళ్లీ కథానాయకుడిగా ప్రేక్షకుల్ని అలరించారు. ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతోపాటు, గోపీచంద్‌కి మాస్‌ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. యాక్షన్‌ కథల్లో ఒదిగిపోయే నటుడిగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. అదే సమయంలో వినోదాత్మక కథల్లోనూ మెప్పించగలనని కొన్ని చిత్రాలతో నిరూపించారు. ‘ఒక్కడున్నాడు’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘గోలిమార్‌’, ‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్‌’ తదితర చిత్రాలు గోపీచంద్‌కి మంచి పేరే పేచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘సీటీమార్‌’లో నటిస్తున్నాడు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈరోజు గోపీచంద్‌ పుట్టినరోజు.