Politics

మీ కలర్‌సెన్స్ అదిరింది

మీ కలర్‌సెన్స్ అదిరింది

నల్లచొక్కాతో అసెంబ్లీకి చంద్రబాబు.. విజయసాయిరెడ్డి సెటైర్లు ….

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలంతా హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతల అరెస్టులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు.

చంద్రబాబు నల్లచొక్కా ధరించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియాలో చంద్రబాబు నల్ల షర్టు వేసుకున్న ఫోటోను షేర్ చేసి ఆయనపై విమర్శలు చేశారు.

‘నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్‌సెన్స్!’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.