DailyDose

ల్యాండ్‌రోవర్ నుండి 1100 ఉద్యోగాలు కట్-వాణిజ్యం

ల్యాండ్‌రోవర్ నుండి 1100 ఉద్యోగాలు కట్-వాణిజ్యం

* దేశంలో పెట్రలో, డీజిల్ ధరలు వరుసగా పదో రోజు కూడా పెరిగాయి.లీటర్ పెట్రోల్ పై 47 పైసలు, లీటర్ డీజిల్ పై 93 పైసలు పెంచుతూ దేశంలోని చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకొన్నాయి.వీటితో పాటు విమానాల ఇంధనం ధరలను కూడా పెంచారు.ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రేటును ఒకేసారి 16.3 శాతం పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి.

* అమరావతి (హైకోర్టు)…ఎల్జీ పాలీమర్స్ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ★ ఎల్‌జీ పాలీమర్స్ వ్యవహారంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.★ తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.★ మరికొన్ని పిటిషన్‌లు దాఖలు చేసేందుకు ఎ‌‌ల్‌జీ పాలిమర్స్ తరుపు న్యాయవాది సమయం కోరారు.★ సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.★ తదుపరి విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

* కరోనావైరస్‌ రెండో తరంగం ప్రపంచాన్ని ముంచేందుకు వేగంగా దూసుకొస్తోంది. ఇటీవలే ఆసియాలోనే అతిపెద్ద షిన్‌ఫడి హోల్‌సేల్‌ మార్కెట్లో కరోనావైరస్‌ పడగవిప్పడంతో బీజింగ్‌లో ప్రధాన ప్రాంతాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి.. మరోపక్క అమెరికాలో కూడా ‘స్టే ఎట్‌ హోమ్’‌ నిబంధనలు ఎత్తేయడంతో భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన మరిన్ని ఉద్యోగాలకు కోతలు పడే ప్రమాదం ఉంది. భారత్‌లో కూడా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చెన్నైలో మరోసారి లాక్‌డౌన్‌ విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికాలోని వైద్య నిపుణులు కూడా రెండో తరంగం మొదలైందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

* కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. గత కొంతకాలంగా అమ్మకాలు లేక వాహనరంగం కుదేలైంది. కరోనా కారణంగా ఇప్పుడు ఆ రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ వెయ్యికు పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ విభాగంలో పనిచేసే 1,100మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. రోజు రోజుకీ నిర్వహణ వ్యయం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పీబీ బాలాజీ తెలిపారు.