NRI-NRT

సింగపూర్ నుండి శంషాబాద్ చేరిన 146మంది ప్రవాసులు

సింగపూర్ నుండి శంషాబాద్ చేరిన 146మంది ప్రవాసులు

లాక్‌డౌన్ కార‌ణంగా సింగ‌పూర్ చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు ప్రవాసులను అక్క‌డి తెలుగు స‌మాజం స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది. తెలుగు స‌మాజం సౌజ‌న్యంతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన‌ 146 మంది సిల్క్ ఎయిర్ విమానంలో సింగపూర్ నుండి బ‌య‌ల్దేరారు. వీరిలో 82 మంది తెలంగాణ వారు, 62 మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారు ఉండ‌గా… ఇద్ద‌రు త‌మిళ‌నాడుకు చెందిన వారు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ఈ విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది.