DailyDose

పిడుగుపడి 22మంది మృతి-నేరవార్తలు

Crime News Roundup - Thunderbolt Kills 22 People In India

* శ్రీశైలం ఆలయంలో అక్రమాలపై ఏసీబీ విచారణ..అక్రమాలపై విచారణ చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు..రూ.2.56 కోట్లు అవినీతి జరిగినట్టు ప్రాధమిక విచారణలో బట్టబయలు..31 మంది అధికారులు, సిబ్బంది పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జీవో జారీ.

* బిహార్​లో 24 గంటల వ్యవధిలో పిడుగుపాటుకు గురై 22మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది.వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది.అసమ్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఔరంగాబాద్​లో ఇద్దరు, బక్సర్​లో ముగ్గురు, నలందలో ఇద్దరు, జుమ్రుయిలో ఒక్కరు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.బిహార్​లో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. 

* ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ను పరిశీలించడానికి వచ్చిన బృందానికి తిరిగి దక్షిణ కొరియా వెళ్లేందుకు హైకోర్టు అనుమతిగత నెల 13న విశాఖ ఎల్జీ పాలిమర్స్ ను పరిశీలించిన 8 మంది విదేశీయుల బృందం8 మందికి పోలీసుల నోటీసులుతిరిగి విదేశానికి వెళ్లే అవకాశం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన విదేశీయులువిచారణ అనంతరం తిరిగి వెళ్లేందుకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చిన ధర్మాసనంపూర్తి వివరాలు సమర్పించిన తర్వాతే స్వదేశానికి వెళ్లాలని ఆదేశంపోలీసుల దర్యాప్తుకు ఎప్పుడు అవసరమైన రావాలని షరతు.

* ఎర్రగుట్ల ఐసీఎల్ సిమెంట్ కర్మాగార రిటైర్ ఉద్యోగి వెంకటరమణ హత్య కేసులో నిందితులైన ముసలయ్య అరెస్ట్…నిందితుడిని మీడియా ముందు హాజరు పరచి వివరాలను వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్..పథకం ప్రకారమే హత్య…ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం.

* ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన వాహననాలకు నిప్పంటించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.