Movies

విజయచిహ్నం….విజయనిర్మల

విజయచిహ్నం….విజయనిర్మల

విజయానికి చిహ్నం..విజయనిర్మల గారి జీవితం…ఆరక్షరాల అచ్చమైన అందమైన పేరున్న..ఈ బాపు బొమ్మ….అభినయం తో అందరిని అలరించిన మేటి నటి…దర్శకురాలు విజయనిర్మల…నరసరావుపేట నుంచి నటించడానికి..వచ్చిన “నిర్మల”….మొదట తమిళ సినిమా మత్స రేఖ సినిమాలో బాలనటి గా నటించింది…మహనటుడు Ntr చేతుల మదుగా తొలిసరిగా “తిలకం దిద్దుకొని”కృష్ణుడిగా.”.పాండురంగ మహత్యం”లో పాదం మోపి అందరిని అలరించి…..తదనంతరం విజయనిర్మలగా పేరు మార్చుకొని….విజయాలను సాధిస్తూ వెలిగింది…. మీసాల కృషుడి “సాక్షి”గా హీరో కృష్ణను వివాహమాడి..ఆ “ముహూర్త బలం” తో..”పండంటికావురం…”కొనసాగించారు….”పిన్ని” గా….కృష్ణ గారి సంతానం తో,కుటుంబం తో చక్కని జీవితాన్ని కొనసాగించారు….దర్శకత్వం మీద అభిమానంతో, ఇష్టం తో.. మీనా తో మొదలెట్టి.హీరో కృష్ణ గారి ప్రోత్సాహం తో 44 సినిమాలకు దర్శకత్వం వహించి 2002 లో గిన్నిస్ బుక్ లో అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళగా పేరు నమోదు పొందారు…పనితనం కల్గిన పనిరాక్షసిగా…క్రమశిక్షణ తప్పకుండా…ANR లాంటి నటుల మెప్పును పొంది హీరో కృష్ణ తోనే కాకఅనేక ఇతర సహనటులను హిరోలుగా పెట్టి దర్శకత్వం వహించింది…మంచి సందేశాత్మక చిత్రాలను అందించింది…చివరి వరకు సినిమా తోనే అనుబంధం కల్గి..70 ఏళ్ల పై బడిన వయసులో కూడా “శ్రీ శ్రీ”సినిమాలో నటించింది…అదే ఆమె ఆఖరు సినిమా..తన కొడుకు.సినీ నరేష్.ను హీరోగా పెట్టి సినిమాలను చేసి..అతనికో మార్గాన్ని మలచింది.. సంపూర్ణ గృహిణిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ..ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి “స్వర్గస్తులయ్యారు”…సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల గారు హీరోకృష్ణగారితోనే 50 సినిమాలునటించి రికార్డ్ నెలకొల్పారు…రఘుపతి వెంకయ్య గారి అవార్డ్ ను అందుకున్నారు.భానుమతి,సావిత్రి,గార్ల దర్శకత్వ వారసత్వాన్ని కొనసాగించిన…”విజయనిర్మల గారికి 50 చిత్రాలు చేయాలాన్న… కోరిక ఒక్కటే మిగిలిపోయింది….ఆమెకు చాలా ఇష్టమైన పాట..”వస్తాడు నా రోజు ఈ రోజు”….ఈ సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ..