Fashion

ముద్దు వెనుక బోలెడు ఆరోగ్య ముచ్చట్లు

Couples Lifestyle News || The Health Benefits Of Kiss

ముద్దు పెట్టుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, కానీ..

ముద్దు పెట్టుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే.. మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.

ప్రేమను వ్యక్తం చేయాలన్నా.. రొమాన్స్‌ను మొదలు పెట్టాలన్నా ‘ముద్దు’ ఉండాల్సిందే. తమకు నచ్చిన వ్యక్తిపై ప్రేమను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే ముద్దు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది. ముద్దు ఇద్దరి మధ్య ప్రేమను మాత్రమే కాదు.. సెక్స్‌వల్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. హార్మోన్లను ప్రేరేపించి చక్కని సెక్స్ లైఫ్‌కు చుక్కానిలా మారుతుంది. అందుకే ముద్దు ఎప్పుడూ చేదు కాదని అంటారు. కానీ.. ఈ కరోనా టైమ్‌లో ముద్దు అంత సేఫ్ కాదు. ముఖ్యంగా వేర్వేరు ప్రాంతాల్లో నివసించే జంటలు.. ‘ముద్దు’ పెట్టుకొనే ముందు తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే.. ముద్దు వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. అలాగే, ఈ సమయంలో అపరిచితులను ముద్దాడటం కూడా అస్సలు మంచిది కాదు. ఇక కరోనా మహమ్మారిని కాసేపు పక్కన పెడితే.. ‘ముద్దు’ చాలా హెల్దీ అని నిపుణులు చెబుతున్నారు. మరి, ముద్దుతో శరీరంలో కలిగే మార్పులు, ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా!

❂ ఒక్క ముద్దుతో మీ ముఖంలోని 34 కండరాలతో పాటు 112 పోస్ట్రల్ కండరాలకు ఉత్తేజం కలుగుతుంది.
❂ గుండె పనితీరు మరింత మెరుగుపరిచేందుకు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముద్దే ఔషదం.
❂ ఒక జంట ముద్దు పెట్టుకుంటే ఇద్దరిలో 10 నుంచి 15 కేలరీల శక్తి బర్న్ అవుతుందంట.
❂ ముద్దు పెట్టుకునేప్పుడు విడుదలయ్యే ఉమ్మి వల్ల దంత క్షయం దూరమవుతుంది.
❂ దంతాలు తెల్లగా కావాలంటే లిప్ టు లిప్ కిస్ తప్పనిసరి.
❂ ముద్దు వల్ల ఏర్పడే సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి.
❂ ముద్దుకు తలనొప్పి తగ్గించే శక్తి కూడా ఉంది.
❂ లిప్ కిస్‌తో మెడ, దవడ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. రోజు ముద్దు పెట్టుకుంటే వాటికి మంచి షేప్‌ వస్తుంది.
❂ ముద్దు రక్తపోటును నియంత్రిస్తుంది.
❂ ఒత్తిడి నుంచి దూరం కావడానికి కూడా ముద్దు చాలా అవసరం.
❂ ముద్దు కుంగుబాటు నుంచి దూరం చేస్తుంది.
❂ ముద్దు పెట్టుకొనేప్పుడు శరీరంలో అడ్రినాలిన్ అనే రసాయం విడుదల అవుతుంది. ఇది వివిధ రకాల నొప్పులను తగ్గిస్తుంది.
❂ శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.