Politics

కేసీఆర్ అద్భుత నిర్ణయం

తెలంగాణా ప్రభుత్వం మాజీ ప్రధాని పివి నరిసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపింది. ఈ సందర్భంగా పివి జ్ఞానభూమిలో ఆయన చిత్ర పటానికి సిఎం కేసిఆర్‌తోపాటు ఇతర నేతలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసిఆర్‌ మాట్లాడుతూ తెలుగు అకాడమీకి పివి నరిసింహారావు పేరు పెడతామని అన్నారు. ప్రధానిగా పివి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారని అన్నారు. పివి ఓ రాజకీయ ఠీవీఅని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి అని కొనియాడారు. ఆయనకు తగినంత గౌరవం లభించలేదని, తమ ప్రభుత్వం ఆ గౌరవం తెచ్చేలా కృషి చేస్తుందని చెప్పారు. పివి పేరు మీద ఒక తపాలా స్టాంపు, సెంట్రల్‌ వర్శిటీకి పివి పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. పివి జ్ఞానభూమిలో మెమోరియల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పివికి భారతరత్న ఇవ్వాలని తన నేతృత్వంలో ఒక బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని కేసిఆర్‌ చెప్పారు.