NRI-NRT

బెహ్రెయిన్‌లో పీవీ జయంతి

TNILIVE Bahrain Telugu News || PV Centennial Birthday In Bahrain By NRI TRS

బహరేన్ లో ఘనంగా భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతి వేడుకలు..ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్వర్యంలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి శతజయంతి సందర్బంగా .పివి నర్సింహారావుగారి చిత్ర పటానికి పూలమాల వేసి వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూఘన నివాళి అర్పిస్తున్నాము.తెరాస కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారి అధ్యక్షతన గౌరవ మినిస్టర్ కెటిఆర్ గారి సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శతాబ్ది జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగిందిపీవీ ని గౌరవించేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ గారికి ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ పక్షాన అభినందిస్తున్నట్లు తెలిపారు.Covid – 19 కారణాల వాళ్ళ అందరం కలిసి వేడుకలు చేయలేక పోయాము….ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ , బొద్దేటి కిషోర్ మాట్లాడుతూతెలంగాణ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచే తెలంగాణ అస్ధిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకోవడంలో ముందు వరుసలో ఉన్నదన్నారు.ఈ మేరకు పివి నర్సింహారావుగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి తెలంగాణ నుంచి ఎంపికైన తొలి ముఖ్యమంత్రి గానే కాదు, తెలుగు జాతి అంతా సగర్వంగా చెప్పుకునేలా దక్షిణ భారతదేశం నుంచే ప్రధాని పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి వ్యక్తిగా పీవీ ప్రత్యేక గౌరవం పొందారు. ఒక్క రాజకీయ రంగమే కాదు, సాహిత్యంలోనూ వారి సృజన ఎంతో ఎన్నదగింది. కవిగా, కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాద రచయితగా, విమర్శకునిగా వారిది విశ్వరూపమే. పద్దెనిమిది భాషలలోనూ వారు నిష్ణాతులు. వారికి అర్థశాస్త్రంలో ఎంత పట్టుందో, ఆధ్యాత్మిక విషయాలలోనూ అంతే పట్టుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ శతాబ్ది దేశ చరిత్రలో ఇంతటి విశిష్ట విలక్షణ, బహుముఖ ప్రతిభాశాలి పీవీ ఒక్కరే. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏడాదిపొడుగునా నిర్వహించిజాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన సేవలను, కృషిని సంస్మరించుకొనే నేపథ్యంలో ఆయన సమగ్ర వ్యక్తిత్వాన్ని సంక్లిష్టతత్వాన్ని, నానావర్ణ సముచ్ఛయమైన ఆయన జీవన చిత్రాన్ని స్థూలంగా ఆవిష్కరించు కొనే తరుణమిది. బహు భాషాకోవిదులైన పీవీ నరసింహారావు భారతీయ భాషలనే గాక, విదేశీ భాషలను కూడా అభ్యసించి తమ ఆసక్తిని చాటిచెప్పారు. మాతృభాష తెలుగుతో పాటు మరాఠీ, ఉర్దూ, సంస్కృతం, బెంగాలీ, హిందీ, గుజరాతీ, ఒరియా, తమిళ, కన్నడ భాషల్లో ప్రావీణ్యం సంపాదించడమే గాక, ఇవే కాకుండా విదేశీ భాషలైన పర్షియన్‌, స్పానిష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌, అరబిక్‌ భాషల్లో కూడా చక్కగా మాట్లాడే వారని చెప్పుకోవచ్చు.ముక్యంగా మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శతాబ్ది జయంతి ఉత్సవాల కమిటీ సభ్యునిగా నియమితులైన తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ పక్షాన హార్థిక శుభాకాంక్షలు తెలపడం జరిగింది.సీఎం కెసిఆర్ గారికి మరియు మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమములో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ , బొద్దేటి కిషోర్,అరవింద్ , నితిన్ లుపాల్గొన్నారు.