Food

మంచిగా నమిలి మింగాలి

మంచిగా నమిలి మింగాలి

బిజీ లైఫ్ కార‌ణంగానో.. అలానే అల‌వాటు అవ్వ‌డం వ‌ల్ల‌నో చాలామంది ఆహారాన్ని న‌మ‌ల‌కుండా మింగేస్తున్నారు. దీనివ‌ల్ల అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి.

* తొందర తొందరగా ఆహారం తినడం వల్ల కడుపు నిండిండో లేదో అర్థంకాదు. అలాగే ఇంకా ఏమైనా తినాలా లేదంటే ఆపేయాలా అనే సంకేతాలు సరైన సమయంలో మీ మెదడుకు చేరవు.

* ఇలా తిన‌డం వ‌ల్ల ఓవర్ ఈటింగ్ సమస్యకు దారితీస్తుంది. దీంతో శరీరానికి పోషకాలు సరిగా లభించవు. అంతేకాకుండా ఎంత తింటున్నారో అర్థంకాదు. దీన్నేఓవర్ ఈటింగ్ అంటారు. దీనివల్ల బరువు పెర‌గ‌డం ఖాయం.

* ఇది జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. కొంత‌మంది నీళ్లు ఎక్కువ తాగి భోజనం చేస్తారు. అప్పుడు ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో సమస్యలు పెరిగి అదికాస్తా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

* ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డానికి కూడా ఇది కార‌ణంగా మారుతుంది. ఆపై ఇన్సులిన్‌ను నియంత్రించలేక స‌మ‌స్య పెరుగుతుంది. ఇది కాస్త తొంద‌ర‌లో డ‌యాబెటిస్ వ్యాధి బారిన ప‌డేలా చేస్తుంది.

* ఫాస్ట్‌గా తిన‌డం వ‌ల్ల డైట్‌కు కూడా భంగం క‌లుగుతుంది. కాబ‌ట్టి తినేట‌ప్పుడు స‌రిగ్గా న‌మిలి తింటే శ‌రీరానికి స‌రైన పోష‌కాలు అంది ఎలాంటి స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా చేస్తుంది.