DailyDose

పోలీసులపైకి శునకాలు ఉసిగొల్పిన పీవీపీ-నేరవార్తలు

TNILIVE Crime News Roundup || Producer PVP Releases Dogs On To Police

* సీతంపేట ఐటీడీఏ లో చోరీసీతంపేట ఐటీడీఏ అల్లూరీ సీతారామరాజు బ్లాక్ లో చోరీ5 కంప్యూటర్లు చోరీ చేసిన దుండగులువేసిన తలుపు వేసినట్టే ఉన్న జరిగిన చోరీ.సమాచారం అందుకున్న పోలీసు ఘటన స్థలానికి చేరుకొని ప్రారంభించిన దర్యాప్తు.కాసేపట్లో ఘటన స్థలానికి చేరుకోనున్న క్లూస్ టీం.

* తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించి పోలీసుల కి చుక్కలు చూపించాడు.చాలాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడువిషయం తెలుసుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఏ.ఎస్.ఐ రోహిణి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆ యువకుడిని క్షేమంగా దింపారు.తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఏ ఏ ఎస్ఐ రోహిణి ఆ యువకుని విచారించగా తన పేరు బాబు అని తన నాన్న పేరు వీర మణి కుంభకోణం స్వస్థలం అని చెప్పాడు.అనంతరం ఆ యువకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

* జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యమార్కెట్ లో ఉండగా కత్తితో పొడిచి పరారైన గుర్తు తెలియని వ్యక్తిదాడిలో గాయపడ్డ భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపుచికిత్స పొందుతూ మృతిపాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానంఆస్పత్రికి భారీగా వచ్చిన వైసీపీ కార్యకర్తలుభారీగా మోహరించిన పోలీసులుగతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గా పని చేసిన భాస్కరరావు

* ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు జూలై 1కి వాయిదా వేసింది.ఈఎస్‌ఐ అవకతవకల ఆరోపణలపై అరెస్ట్ అయిన అచ్చెన్న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.అచ్చెన్నాయుడి మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో ఈరోజు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది.అయితే జూన్ 30 వరకు కోవిడ్ కారణంగా కోర్టు వర్క్ సస్పెండ్ కావటంతో విచారణను జూలై ఒకటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.

* ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఏకంగా కరాచీలోని పాకిస్థాన్​ స్టాక్ ఎక్స్చేంజ్ పై నలుగురు ముష్కరులు దాడికి పాల్పడ్డారు.

* బ‌ంగ్లాదేశ్ లోని బురిగంగా న‌దిలో ఓ ప‌డ‌వ మునిగిపోయింది. ఈ ప్ర‌మాదంలో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తున్న 23 మంది ప్రాణాలు కోల్పోయారు.మార్నింగ్ బ‌ర్డ్ అనే ప‌డ‌వ‌.. మున్షిగంజ్ నుంచి స‌ద‌ర్ ఘాట్ వైపు వెళ్తున్న స‌మ‌యంలో మౌయురి-2 అనే నౌక‌ను ఢీకొట్టింది. దీంతో ప‌డ‌వ నీటిలో మునిగింది.ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో మొత్తం 50 మంది ఉన్నారు.అయితే మృతుల్లో ముగ్గురు పిల్ల‌లు, ఆరుగురు మ‌హిళ‌లు ఉన్నారు.కొంద‌రు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

* పాలకొల్లులో దొంగనోట్లు ముద్రించి చెలామణీ చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులు అరెస్ట్. వీరి వద్ధ నుండి 7,85,000 దొంగనోట్లు,40,000 నగదు, ప్రింటర్, 3 లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్న పాలకొల్లు పోలీసులు…

* సినీ నిర్మాత, వైసీపీ నేత ప్రసాద్‌ వి.పొట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్​ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.ఇటీవల పీవీపీపై నమోదైన ఒక కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు.ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు.ఈ హఠాత్పరిణామంతో ఖంగుతున్న పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీశ్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్‌ చేశారు.గతవారం పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా, ఈ ఘటన చోటు చేసుకుంది.