DailyDose

వాలంటీర్లు…వ్యభిచారంలో ఒకరు…మద్యం సరఫరాలో మరొకరు-నేరవార్తలు

2020 July Crime News Roundup-Grama Volunteers In Prostitution And Liquor Supply

* జిల్లాలోని తాడిపత్రి పాతకోటకు చెందిన 32వ వార్డులో వాలంటీర్ అనిల్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు.అతడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మరోవైపు వ్యభిచారానికి పాల్పడిన వాలంటీర్‌ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 

* అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కిన గ్రామ వాలంటీర్…కృష్ణా జిల్లాలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు బూక్య జోసెఫ్‌ నున్న సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసుల.శనివారం అర్ధరాత్రి ఆటోలో మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు.అతని నుండి దాదాపు 180 మద్యం బాటిళ్లను నున్న సీఐ ప్రభాకర్, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

* కృష్ణాజిల్లాలో ఆగని గుట్కా సరఫరా గత కొద్ది రోజుల నుండి భారీగా పట్టుబడుతున్న గుట్కా ఇప్పటివరకూ మూడు కోట్ల రూపాయల గుట్కా పట్టుబడింది అయినా కానీ గుట్కా సరఫరా, రవాణా మాత్రం ఆగని వైనం జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో డి.ఎస్.పి రమణమూర్తి ఆదేశాల మేరకు గుట్కా నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపిన కంచికచర్ల పోలీసులు

* రిపాట్రియేష‌న్ విమానాల్లో సౌదీ అరేబియా, యూఏఈల నుంచి వ‌చ్చిన 14 మంది భార‌త ప్ర‌వాసుల వ‌ద్ద జైపూర్‌ విమానాశ్ర‌యంలో‌ ఏకంగా రూ. 15కోట్లు విలువ చేసే బంగారం ప‌ట్టుబ‌డింది.ప్ర‌వాసులు ప‌సిడిని ఎమ‌ర్జెన్సీ ల్యాంపుల్లో దాచిపెట్టి  తీసుకొచ్చినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్ల‌డించారు.వివ‌రాల్లోకి వెళ్తే… రాస్ అల్‌ఖైమా నుంచి స్పైస్ జెట్ విమానం ఎస్‌జీ-9055లో వ‌చ్చిన ముగ్గురు ఎన్నారైలపై అనుమానంతో వారి ల‌గేజీని సోదా చేసిన అధికారుల‌కు 9.339కిలోల బ‌రువు గ‌ల‌‌ 12 గోల్డ్ బార్స్ దొరికాయి. ‌వాటి విలువ 2.25 మిలియ‌న్ దిర్హామ్స్‌(రూ.45,761,100) ఉంటుంద‌ని క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు.  అలాగే సౌదీ అరేబియా నుంచి వ‌చ్చిన మ‌రో రిపాట్రియేష‌న్ విమానంలోని 11 మంది భార‌త ప్ర‌వాసుల‌ను త‌నిఖీ చేయ‌గా వారి ల‌గేజీ నుంచి 22.6528 కిలోల ప‌సిడి ప‌ట్టుబ‌డింది.