Health

ప్లాస్మా పెంచితే వయస్సు తగ్గించవచ్చు

How to reduce your age with albumin and plasma reduction

రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం వస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు. ఆ సంగతి ఎలాగున్నా రక్తంలోని ప్లాస్మా కణాలను సగం వరకూ తొలగించి వాటికి బదులు సెలైన్‌, ఆల్బ్యూమిన్‌లను ఎక్కించడం వల్ల వయసు వెనక్కి మళ్లుతుంది అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. వృద్ధ ఎలుకల్లో చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. దీనివల్ల కణజాలాల్లో ముఖ్యంగా మెదడు, కాలేయం, కండర కణాల్లో పునరుత్పత్తి జరిగినట్లు గుర్తించారు. రక్తంలోని ప్లాస్మాలో సగం తొలగించి ఆల్బ్యూమిన్‌ను ఎక్కించడం వల్ల కొత్త ప్రొటీన్‌ కణాలు విడుదలవుతాయి. అదే సమయంలో ప్లాస్మా గాఢతా తగ్గుతుంది. అంటే- వయసుమీరిన ప్రొటీన్‌ కణాల శాతం తగ్గిపోతుందన్నమాట. దాంతో పాత, కొత్త ప్రొటీన్‌ కణాల సమతౌల్యం ఏర్పడుతుంది. తద్వారా వృద్ధాప్యం రాకుండా ఉంటుందనేది శాస్త్ర నిపుణుల విశ్లేషణ.